వేడి వేడి అన్నం వడ్డించడంలేని అత్తపై కేసు పెట్టిన కోడలు...!
తనకి వేడి వేడి అన్నం వడ్డించడంలేదంటూ అత్తపైన పైన కేసు పెట్టింది ఓ కోడలు.. ఈ విచిత్రమైన సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.

తనకి వేడి వేడి అన్నం వడ్డించడంలేదంటూ అత్తపైన పైన కేసు పెట్టింది ఓ కోడలు.. ఈ విచిత్రమైన సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మంజ్‌గన్వాలో అత్త, కోడళ్లు ఒకే ఇంట్లో ఉంటున్నారు. అయితే వీరిద్దరి భర్తలు వృత్తిరిత్యా వేరువేరు ప్రాంతాల్లో ఉంటారు.
ఈ క్రమంలో సమయానికి అత్త భోజనం వడ్డించలేదంటూ కోడలు ఇటీవలే పోలీసుల హెల్ప్ లైన్ 112కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. అనంతరం వారింటికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. తన అత్త సీరియ్తల్స్ లో లీనమై తనకు వేడి వేడి ఆహారం వడ్డించడం లేదని... అంతేకాకుండా పాడైన ఆహారాన్ని పెట్టడం వలన తన ఆరోగ్యం రోజు క్షీణిస్తోందని పోలీసుల దగ్గర వాపోయింది.
తన కోడలు తనపైన కేసు పెట్టిందని తెలుసుకున్న అత్త.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకి ఇంటి పనుల్లో సహాయం చేయకుండా.. ఎప్పుడు కూడా ఫోన్ పట్టుకొని ఉంటుందని పోలీసులకి వివరించింది. ఇద్దరి వాదనలను విన్న పోలీసులు.. అత్తకోడళ్లను మందలించి.. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు పోలీసులను పిలిచి సమయాన్ని వృధా చేయొద్దని హెచ్చరించారు.
RELATED STORIES
Chaitra Hallikeri: భర్త వల్ల ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ...
24 May 2022 1:50 PM GMTOscar Award: ఓటీటీలో విడుదలయ్యే సినిమాలకు షాక్.. ఆస్కార్ నిబంధన..
22 May 2022 11:12 AM GMTDhanush: ధనుష్ తమ కొడుకే అంటున్న దంపతులు.. చట్టపరంగా నోటీసులు పంపిన...
21 May 2022 3:55 PM GMTRakshit Shetty: నటితో రష్మిక ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ పెళ్లి.. క్లారిటీ...
21 May 2022 1:41 PM GMTKamal Haasan: జాతీయ భాషా వివాదంపై స్పందించిన కమల్.. మాతృభాషకు...
17 May 2022 9:41 AM GMTPallavi Dey: 21 ఏళ్ల బుల్లితెర నటి అనుమానాస్పద మృతి.. స్నేహితుడిపై...
16 May 2022 9:51 AM GMT