Upasana Konidela: మోదీతో ఉపాసన మీట్.. నిజం కాదా.. మరి!!

Upasana Konidela: మెగా ఇంటికి కోడలైనా, అపోలో హాస్పిటల్స్ చైర్ పర్సన్ అయినా ఉపాసన కొణిదెల తనకంటూ ఓ సొంత వ్యక్తిత్వాన్ని ఏర్పరుచుకుని ఓ స్టార్ హీరోయిన్ కంటే ఎక్కువ ఇమేజ్‌ని సంపాదించుకుంది. సామాజిక అంశాలపై స్పందిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఉపాసన దుబాయ్ 2020 ఎక్స్‌పోను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో భేటీ అయిన విశేషాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
మోదీని కలవడం ఎంతో గౌరవంగా ఉంది. ఎన్నో రకాల కొత్త ఆవిష్కరణలు, ఆరోగ్య పరిరక్షణ, మహిళా సాధికారిత, సంస్కృతి పరిరక్షణ వంటి అంశాలపై దృష్టిం సారించడం అనేవి అద్భుతమైన అంశాలు. అలాగే టెక్నాలజీ మనకు ఎన్నో అవకాశాల్ని ఇస్తుంది. దాన్ని మనం తెలివిగా ఉపయోగించుకోవాలి. ఇండియానే మొట్టమొదటి సారిగా చంద్రయాన్ ప్రయోగం చేసింది. ఇలాంటి ఎన్నో విషయాలు ఎక్స్‌పోలో దర్శనమిస్తాయి. మీ పిల్లలను తీసుకెళ్లండి.. ఇలాంటి గొప్ప అవకాశాన్ని మిస్పవద్దు. కోవిడ్‌కి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుని మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది.
అయితే ప్రధాని మోదీని ఉపాసన కలిసిన విషయం నిజం కాదు.. ఆమె అగ్‌మెంటెడ్ రియాలిటీ ద్వారా ప్రధాని మోదీ పక్కన కూర్చున్నట్లు ఫోటో దిగారు. ఈ విషయాన్ని ఉపాసన స్వయంగా ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
అంగ్‌మెంటెడ్ రియాలిటీ అంటే..
అగ్‌మెంటెడ్ రియాలిటీ అనేది లేటెస్ట్ టెక్నాలజీ.. మనిషి చూసే వాస్తవ దృశ్యాన్ని పూర్తిగా కంప్యూటర్ ద్వారా కల్పిత దృశ్యంతో భర్తీ చేస్తుంది.. ఈ టెక్నాలజీని ఉపయోగించి దుబాయ్ 2020 ఎక్స్‌పోలో భారత పార్లమెంట్, ప్రధాని మోదీ ఉన్నట్లు క్రియేట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com