Upasana Konidela: సద్గురు దత్తపుత్రికను.. ఉపాసన ట్వీట్ వైరల్

Upasana Konidela: సద్గురు దత్తపుత్రికను.. ఉపాసన ట్వీట్ వైరల్
Upasana Konidela: స్టార్ హీరో భార్య, భారతదేశంలోని అత్యుత్తమ హాస్పిటల్స్‌లో ఒకటైన అపోలో హాస్పిటల్స్‌కి వైస్ చైర్‌పర్సన్ అయినా ఉపాసనకు కించిత్ కూడా గర్వం ఉండదు..

Upasana Konidela:స్టార్ హీరో భార్య, భారతదేశంలోని అత్యుత్తమ హాస్పిటల్స్‌లో ఒకటైన అపోలో హాస్పిటల్స్‌కి వైస్ చైర్‌పర్సన్ అయినా ఉపాసనకు కించిత్ కూడా గర్వం ఉండదు.. అదే ఆమెను అభిమానులకు చేరువ చేసింది. ఆమె ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌ని అనుసరిస్తుంది. తరచుగా సద్గురు యొక్క ఇషా ఫౌండేషన్‌ను సందర్శిస్తుంటుంది.

ఇటీవల కూడా ఆమె సద్గురువును సందర్శించి ఆశీస్సులు తీసుకున్నారు. తన తాతగారు అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా సద్గురు ఆయనకు ఆశీర్వచనాలు అందించినందుకు ఉపాసన ధన్యవాదాలు తెలిపారు. ఉపాసన తనను తాను సద్గురువు దత్తపుత్రికగా ట్విట్టర్‌లో పేర్కొంది. ఆమె సద్గురు మరియు అతని కుమార్తె రాధేతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఆమె ఫోటోను ఉటంకిస్తూ, "సద్గురు తన కుమార్తెలతో ఉన్నారు. ఒకరు ఆయనకు నిజమైన కుమార్తె, మరొకరు ఆయన దత్తపుత్రిక అని తెలిపారు. సద్గురు సన్నిధిలో ఉండటం నాకు ఎల్లప్పుడూ సంతోషాన్ని ఇస్తుంది. తాతగారి పుట్టినరోజుకి వచ్చినందుకు ధన్యవాదాలు అని ట్వీట్‌లో పేర్కొంది.

Tags

Next Story