US: అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగమే : అమెరికా

అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగమని స్పష్టం చేసింది అమెరికా. ఇందుకుగాను అమెరికా చట్ట సభలలో బిల్లును ప్రవేశపెట్టారు. ఒకేగాన్ కు చెందిన డెమొక్రటిక్ సెనేటర్ జెఫ్ మెర్ల్కీ, టెనస్సీ నుంచి రిపబ్లికన్ సెనేటర్... బిల్ హాగెర్టీ.. సెనేట్ తీర్మానంపై సహకరించారు. భారత దేశ రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ ను రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో అంతర్భాగంగా యునైటెడ్ స్టేట్స్ గుర్తిస్తుందని తెలిపారు.
విలువలకు, స్వేచ్చకు, నియమాలకు అమెరికా మద్దతునిస్తుందని యూఎస్ఏ తెలిపింది. ఈ తీర్మానం భారత దేశ రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ ను రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో భాగమని-పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో భాగం కాదని అమెరికా స్పష్టం చేసింది. ఈ ప్రాంతానికి మద్దతును, సహాయాన్ని అందించడానికి అమెరికా ఎప్పుడూ ముందుంటుందని చెప్పింది.
భారత్ - చైనా నియంత్రణ రేఖ వెంబడి చైనా జరుపుతున్న సైనిక దురాక్రమణను అమెరికా ఖండించింది. సెనేటర్లు జెఫ్ మెర్ల్కీ, బిల్ హాగెర్టీ ప్రవేశపెట్టిన ద్వైపాక్షిక తీర్మానం భారత్, చైనా మధ్య అంతర్జాతీయ సరిహద్దుగా మెక్ మాన్ రేఖను యునైటెడ్ స్టేట్స్ గుర్తించినట్లు అమెరికా తెలిపింది. ఇకపై ఈ రేఖనే ఇరు దేశాల మధ్య సరిహద్దుగా వ్యవహరిస్తుందని అమెరికా స్పష్టం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com