Uttar Pradesh: డాక్టర్ల ఘాతూకం.. వైద్యం చేస్తూ కిడ్నీ మాయం

Uttar Pradesh: ఫీజుల రూపంలో అన్యాయంగా దండుకునేది చాలక ఓ వ్యక్తి కిడ్నీని అక్రమంగా అపహరించారు. మనిషి శరీరానికి మూత్ర పిండాలు ఎంత అవసరమో తెలిసిందే. అవి సక్రమంగా పని చేయకపోతే జీవనం అస్థవ్యస్థమవుతుంది. అందుకే కిడ్నీ ఫెయిల్ అయితే దాతల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. ఉత్తరప్రదేశ్ అలీఘర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి కస్‌గంజ్‌కు చెందిన హోంగార్డు సురేష్ చంద్ర వచ్చాడు.
జిల్లా మేజిస్ట్రేట్ నివాసంలో హోంగార్డుగా సురేష్ పనిచేస్తున్నాడు. "ఏప్రిల్ 12, 2022న అల్ట్రాసౌండ్ చేసిన తర్వాత అతడి ఎడమ కిడ్నీలో రాయి ఉందని, తొలగించాలని చెప్పారు వైద్యులు. దాంతో అతడు ఆలస్యం చేయకుండా రెండు రోజుల్లోనే పారి ఆసుపత్రిలో చేరి ఆపరేషన్ చేయించుకున్నాడు.
కిడ్నీలో రాళ్లు తొలగించాము.. ఇప్పుడు ఏ ఇబ్బందీ ఉండదు అని కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపించారు. ఆపరేషన్ జరిగి దాదాపు ఏడు నెలలు అయింది. ఒక రోజు ఉన్నట్టుండి కడుపునొప్పిగా అనిపించడంతో మళ్లీ అదే హాస్పిటల్‌లో డాక్టర్ సలహాతో అల్ట్రాసౌండ్ చేయించుకున్నాడు. వచ్చిన రిపోర్టులో అతడి ఎడమ కిడ్నీ లేదని తేలింది.
కిడ్నీలో రాళ్లను తొలగించే పేరుతో ఆసుపత్రి వైద్యులు తన కిడ్నీలో ఒకదానిని తొలగించారని హోంగార్డు ఆరోపించాడు. ఆస్పత్రి యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సురేష్ ఫిర్యాదు చేశాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com