Uttar Pradesh : 10కోట్ల దున్నపోతు

ఉత్తర ప్రదేశ్ ముజఫర్‌నగర్‌లో పశుమేళాలో ఓ దున్నపోతు విజేతగా నిలిచింది. దాని ధర ఎంతో తెలుసా..అక్షరాలా 10కోట్లు. వ్యవసాయ,జంతు ప్రదర్శనకు తీసుకువచ్చిన ఈ దున్నపోతు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. అక్కడకు వచ్చిన వారంతా ఆసక్తిగా తిలకించారు.సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. ముజఫర్‌నగర్‌లోని జాతీయ జంతు ప్రదర్శనశాలలో హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎన్నో పశువులను తీసుకువస్తుంటారు.. అయితే పానిపట్ నుంచి తీసుకొచ్చిన ముర్రా జాతి దున్నపోతు ఎగ్జిబిషన్‌లోనే ఆధిపత్యం చెలాయించింది.పానిపట్‌లోని దిద్వాడి గ్రామం నుండి పదంశ్రీ నరేంద్ర సింగ్ తన జంతువులను ప్రదర్శనకు తీసుకువచ్చారు. వాటిని చూసేందుకు జంతు ప్రేమికులు ఆసక్తి చూపారు. జాతీయ స్థాయిలో పలుసార్లు విజేతగా నిలిచింది ఈ దున్నపోతు. దాదాపు 16 క్వింటాళ్ల బరువున్న ఈ దున్నపోతుకు రోజూ 10 కిలోల మేత వేస్తారు. ఎనిమిది నుంచి 10 కి.మీ వరకు నడక సాగిస్తారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com