Uttar Pradesh: కన్నతండ్రి కర్కశత్వం.. 36 ఏళ్లుగా కూతుర్ని గదిలో బంధించి..

Uttar Pradesh: కన్నతండ్రి కర్కశత్వం.. 36 ఏళ్లుగా కూతుర్ని గదిలో బంధించి..
Uttar Pradesh: అంగవైకల్యంతో లేదా మానసిక అనారోగ్యంతో పుట్టినా అమ్మానాన్న తామేం పాపం చేశామో తమకు ఇలాంటి బిడ్డను ఇచ్చాడు దేవుడు అని అనుకుంటూనే తమ బాధ్యతలను నిర్వర్తిస్తుంటారు.

Uttar Pradesh: అంగవైకల్యంతో పుట్టినా అమ్మానాన్న తామేం పాపం చేశామో తమకు ఇలాంటి బిడ్డను ఇచ్చాడు దేవుడు అని అనుకుంటూనే తమ బాధ్యతలను నిర్వర్తిస్తుంటారు. కానీ ఓ తండ్రి మానసిక వైకల్యంతో పుట్టిన కూతురు పట్ల తన అమానుషత్వాన్ని ప్రదర్శించాడు. ఏ మాత్రం జాలీ దయ లేకుండా ఒంటరిగా గదిలో బంధించాడు. యూపీలో జరిగిన ఈ దారుణ ఘటన తండ్రి మరణానంతరం వెలుగులోకి వచ్చింది.


ప్రస్తుతం 53 ఏళ్ల సప్నా జైన్‌ను స్థానిక ఎన్‌జిఓ సేవా భారతి సభ్యులు రక్షించారు. హత్రాస్‌కు చెందిన బిజెపి ఎమ్మెల్యే అంజులా మహౌర్‌కు సప్నా దుస్థితి గురించి తెలియజేశారు. ఎమ్మెల్యే సప్నా కుటుంబసభ్యులతో మాట్లాడి ఆమెను ఆగ్రాలోని మానసిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

కూతురి 'మానసిక ఆరోగ్యం' సరిగా లేదని భావించిన తండ్రి చీకటిగా, మురికిగా ఉన్న గదిలో గొలుసుతో బంధించి ఉంచారు. స్నానానికి నీరు పై నుంచి విసరడం, భోజనం తలుపు కింద నుంచి పపించడం చేసేవారు. అంతేకానీ ఇన్నేళ్లలో ఎప్పుడూ గది తలుపులు తీయలేదు.

సప్నా తండ్రి, గిరీష్ చంద్ ఇటీవల మరణించారు. దీంతో కుటుంబసభ్యులు సప్నా పరిస్థితిని ఎన్‌జీవో సభ్యులకు తెలియజేశారు. దీంతో సప్నా పరిస్థితిని పరిశీలించడానికి సంస్థ నుండి మహిళల బృందం వెళ్ళింది.

సేవా భారతి సీనియర్ సభ్యురాలు నిర్మలా సింగ్ మాట్లాడుతూ, "మేము ఆమెను చాలా అధ్వాన్నమైన స్థితిలో చూశాము. ఆమె మొత్తం మురికితో ఉంది. మురికి బట్టలు ధరించింది. NGO సభ్యులు ఆమెకు స్నానం చేయించి, ఆమెకు కొన్ని శుభ్రమైన బట్టలు ఇచ్చి ధరించేలా చేశారు.


ఆమెకు 17 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు తండ్రి గదిలో బంధించాడు. ఆ తర్వాత బయటి ప్రపంచాన్ని చూడలేదు. ఆమెను పరీక్షించిన వైద్యుడు జ్ఞానేంద్ర సింగ్ మాట్లాడుతూ.. 'ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం.. ఆమె త్వరలోనే కోలుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సప్నా దుస్థితిపై వ్యాఖ్యానించడానికి ఆమె కుటుంబం నిరాకరించింది.

Tags

Read MoreRead Less
Next Story