Uttar Pradesh : చిరుత దాడిలో మహిళ మృతి

బహిర్భూమికి వెళ్లిన మహిళపై చిరుత దాడి చేసింది. ఈ ఘటనలో మహిళ మృతి చెందింది. ఉత్తర్ ప్రదేశ్ నగీనా పట్టనంలోని కాజీవాలా గ్రామంలో మిథ్లేష్ దేవి అనే మహిళ ఆదివారం ఉదయం బహిర్భూమికి వెళ్లింది. మిథ్లేష్ దేవిపై ఓ చిరుత దాడి చేయగా సదరు మహిళ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.చిరుత దాడిలో మహిళ తీవ్రంగా గాయపడిందని ఫారెస్ట్ అధికారి ప్రదీప్ శర్మ తెలిపారు. చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు బోనులను ఏర్పాటు చేశారు. గ్రామీన ప్రజలు బహిర్భూమికి ఊరి బయటకు వెళ్లకుండా ప్రభుత్వాలు ఇప్పటికే పలు పథకాలను ప్రవేశపెట్టాయి. టాయ్ లెట్ ను ఇంటి దగ్గరే కట్టుకోవడానికి పలు స్కీంలను ప్రవేశపెట్టాయి. అయినా పలు గ్రామీన ప్రజల్లో ఇప్పటికీ అవగాహన లేనట్లు తెలుస్తోంది.
Next Story