Uttar Pradesh election 2022 : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చివరి విడత పోలింగ్ ప్రారంభం

Uttar Pradesh election 2022 : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చివరి విడత పోలింగ్ ప్రారంభమైంది. 9 జిల్లాల్లోని 54 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 613 మంది అభ్యర్థులు పోటీలో నిలువగా 2.6 కోట్ల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగుతుంది. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తోన్న లోక్‌సభ నియోజకవర్గం వారణాశి పరిధిలో ఓటింగ్ జరగుతోంది.
ఈ దశ పోరులో యూపీ పర్యాటక శాఖ మంత్రి నీల్‌కాంత్ తివారీ వారణాశి సౌత్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. శివ్‌పుర్-వారణాశి నియోజక వర్గం నుంచి అనిల్ రాజ్‌భర్, వారణాశి నార్త్ నుంచి రవీంద్ర జైస్వాల్, జౌన్‌పుర్ నియోజకవర్గం నుంచి గిరీష్ యాదవ్, మీర్జాపుర్ నుంచి రామశంకర్ సింగ్ పటేల్ పోటీ పడుతున్నారు. కేబినెట్ మంత్రి పదవికి రాజీనామా చేసి సమాజ్‌వాదీలో చేరిన ధారాసింగ్ చౌహాన్.. ఘోశి నుంచి పోటీలో ఉన్నారు.
వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది బీజేపీ. అటు అధికారం కోసం తీవ్రంగా శ్రమిస్తోన్న సమాజ్‌వాదీ పార్టీకి కూడా ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. నువ్వానేనా అన్నట్లు సాగిన ఎన్నికల ప్రచారంలో రాజెవరో బంటు ఎవరో తేలనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com