Uttarakhand: థైరాయిడ్ ను జయించాలనుకుంది... గోల్డ్ మెడల్ సాధించింది...

ఏదైనా ఉన్నతమైనది సాధించేందుకు వయసు అవరోధం కాదు. కుటంబ బాధ్యతలు, సమయా భావం అసలే సమస్యలు కావు. ధృఢ సంకల్పం ఉంటే చాలు. అద్బుతాలు సాధించవచ్చు అని నిరూపిస్తున్నారు దెహ్రాదూన్ కు చెందిన ప్రతిభా తాప్లియాల్(41). మధ్యప్రదేశ్ లోని రత్లామ్ లో భారత బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ నిర్వహించిన 13వ జాతీయ సీనియర్ వుమెన్ బాడీబిల్డింగ్ ఛాంపియన్ షిప్ లో ప్రతిభ స్వర్ణ పతాకాన్ని సాధించారు. ఇద్దరు టీనేజీ పిల్లలకు తల్లి అయిన ప్రతిభ రెండవ ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఈ క్రీడ కోసం కసరత్తులు ప్రారంభించిన రెండేళ్లలోనే ఆమె స్వర్ణపతాకాన్ని అందుకోవడం ఓ రికార్డ్ అని చెప్పవచ్చు. అయితే ఐదేళ్ల క్రితం ప్రతిభ విపరీతమైన ధైరాయిడ్ సమస్యతో బాధపడుతుండేవారు. వైద్యుల సూచన మేరకు జిమ్ లో చేరిన ప్రతిభ కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే అధిక బరువు సమస్యను అధిగమించారు. అయితే ఈ క్రమంలో ఆమె శరీరం తత్వాన్ని అధ్యాయనం చేసిన భర్త భూపేశ్ ఆమెను బాడీబిల్డింగ్ క్రిడ దిశగా ప్రోత్సహించారు. స్వతహాగా కసరత్తులపై ప్రత్యేక శ్రద్ధ వహించే భూవేశ్ ప్రతిభకు తర్ఫీదు ఇచ్చారు. అలా తొలి ప్రయత్నంలో విఫలమవ్వగా, ప్రతిభ మరింత శ్రద్ధగా తాజా పోటీలకు సిద్ధమయ్యారు. సరైన డైట్ పాటిస్తూ రోజుకు సుమారు 7గంటలు జిమ్ లో శ్రమించారు. అంకుంటిత దీక్షతో స్వర్ణ పతాకం జేజిక్కించుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com