Uttarakhand: జోషీమఠ్ కుంగుబాటు; 600 కుటుంబాల తరలింపు

Uttarakhand: జోషీమఠ్ కుంగుబాటు; 600 కుటుంబాల తరలింపు
రోజురోజూ కుంగిపోతున్న జోషీమఠ్‌లో; భయాందోళనలో ప్రజలు; 600 కుటుంబాలకు పునరావాసం

ఉత్తరాఖండ్ లోని జోషీమఠ్‌లో ఆలయం కుప్పకూలిపోవడంతో పరిసర ప్రాంత ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కూర్చోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు. దీనిపై స్సందించిన సీఎం పుష్కర్‌ సింగ్‌ దామి అక్కడి ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందా ఆదేశాలు జారీ చేశారు.



ఆలయం కుప్పకూలిన సమయంలో అందులో ఎవరూ లేకపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పిందని తెలుస్తోంది. ఈ ఘటన చోటుచేసుకోవడానికి 15 రోజుల ముందు నుంచీ పరిసర ప్రాంతాల్లో పెద్ద పగుళ్లు ఏర్పాడ్డాయని స్థానికులు చెబుతున్నారు. ఇక మరో 50 ఇళ్లలో ఇదే విధంగా భారీ పగుళ్లు ఏర్పడుతుండటంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అధికారులు తెలిపారు.



ఆ కాలనీలో విష్ణుప్రయగ్‌ జల్‌ విద్యుత్‌ పారియోజన ఉద్యోగులను వేరే ప్రాంతానికి తరలించినట్లు ఆ శాఖ డైరక్టర్‌ పంకజ్‌ చౌహాన్‌ వెల్లడించారు. అక్కడ జరుగుతున్న బైపాస్‌ రోడ్డు లాంటి భారీ నిర్మాణ పనుల తక్షణం నిలిపివేశారు.


తమకు పునరావాసం కల్పించాలని జోషీమఠ్‌ తాశీల్‌ కార్యాలయం వద్ద బాధితులు ధర్నా చేశారు. దీంతో ముఖ్యమంత్రి దామీ జోషీమఠ్‌లోని 600 కుటుంబాలను అక్కడి నుంచి ఖాళీ చేయించాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం సీఎం దామీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జోషీమఠ్‌లోని పరిస్థితులను సమీక్షించారు. ప్రజల ప్రాణాలు కాపాడటమే మన మొదటి ప్రాధాన్యతని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story