Uttarakhand : తండ్రి ఎమ్మెల్యే.. కొడుకుది పంక్చర్ షాప్..!

కొందరు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని అనుకుంటారు.. అందుకే ఉదాహరణ ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ కుటుంబం.. సాధారణంగా అయితే ఓ ఎమ్మెల్యే కుమారుడు అయితే ఏం చేస్తాడు దర్జాగా కాలు మీద కాలేసుకుని కూర్చుంటాడు.. కానీ ఇక్కడ మనం మాట్లాడుకునే ఓ ఎమ్మెల్యే ఇద్దరు కుమారులు అతిసాధారణ జీవితాన్ని గడుపుతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ఉత్తరాఖండ్అసెంబ్లీ ఎన్నికల్లో పితోరాగఢ్జిల్లా గంగోలీహాట్స్థానం నుంచి బీజేపీ తరుపున గెలుపొందారు ఫకీర్రామ్ టమ్టా.. అంతకుముందు కార్పెంటర్ గా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించిన ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయన ఇప్పుడు ప్రజాప్రతినిధి అయినప్పటికీ ఆ ఎఫెక్ట్ మాత్రం తన ఇద్దరు కుమారుల పైన పడలేదు.
ఫకీర్రామ్ టమ్టాకి ఇద్దరు కుమారులున్నారు. పెద్ద జగ్దీష్టమ్టా రోడ్డు పక్కన పంక్చర్ల షాపు నిర్వహిస్తున్నాడు.. ఇక చిన్నకుమారుడు వీరేంద్ర రామ్తన తండ్రి బాటలోనే కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు.. అయితే ఈ పని తమ ఇష్టంతోనే చేస్తున్నామని పని చేయకపోతే ఇల్లు గడవదని చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com