ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడుకి కరోనా పాజిటివ్

దేశంలో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. నిత్యం పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. సామన్యుల నుంచి రాజకీయ ప్రముఖుల వరకు ఈ మహమ్మారి ఎవరినీ వదలటం లేదు. తాజాగా ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడుకి కరోనా సోకింది. జీజేపీ ఛీప్ బన్సీంధర్ భగత్ కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
'నేను శుక్రవారం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నా. శనివారం ఉదయం వచ్చిన రిపోర్టులో కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఇటీవల నాతో సన్నిహితంగా మెలిగిన పార్టీ కార్యకర్తలు, ఇతరులు ఎవరైనా వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోండి.. మీ అందరి ఆశీర్వాదంతో నేను త్వరలోనే కోలుకుంటానని ఆశిస్తున్నా' అని బన్సీంధర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా, ఉత్తరాఖండ్‌లో ఇప్పటివరకు 5,502 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన 239 మంది ప్రాణాలు కోల్పోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com