Uttarakhand Floods: సరదాగా ట్రెక్కింగ్‌కు వెళ్లారు.. మంచు చరియలు విరిగిపడి..

Uttarakhand Floods (tv5news.in)
Uttarakhand Floods: ఇప్పటికే వరదలతో తీవ్ర అస్తి, ప్రాణనష్టాలతో కుదేలవుతున్న దేవభూమి ఉత్తరాఖండ్‌లో.. మరో ఘోర ప్రమాదం తీవ్రంగా కలిచివేసింది. ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ మధ్య హార్సిల్-చిట్కుల్ ట్రెక్ రూట్‌లో పర్వతారోహణకు వెళ్లిన 11 మంది బెంగాలీ ట్రెక్కర్లు.. మంచు చరియలు విరిగిపడి మృత్యువాతపడటం తీవ్ర విషాదం నింపింది. 17 వేల అడుగుల ఎత్తులో లాంఖగా కనుమ వద్ద ఈ విషాదం చోటుచేసుకుంది.
ట్రెక్కింగ్‌కు వెళ్లిన పర్వతారోహకులు అక్టోబర్ 18న భారీగా మంచు కురవడంతో దారితప్పారు. దారితప్పిన వారిలో ట్రెక్కర్లతో పాటు పోర్టర్లు, గైడ్లు ఉన్నారు. పర్వాతరోహకులు దారితప్పిన విషయం అక్టోబర్ 20న NDRF దృష్టికి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన సిబ్బంది అడ్వాన్స్‌డ్ లైట్ హెలీకాప్టర్లతో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
NDRF ఆపరేషన్‌లో 15వేల 700 అడుగుల ఎత్తులో 4 మృతదేహాలను గుర్తించారు. అనంతరం 16,800 అడుగుల ఎత్తులో ప్రాణాలతో ఉన్న ఓ ట్రెక్కర్‌ను కాపాడారు. అక్టోబర్ 22న మరో వ్యక్తిని రెస్క్య్ చేసిన ప్రత్యేక బృందానికి అదే రోజు మరో 5 మృతదేహాలు లభించాయి. డోగ్రా స్కౌట్స్, అస్సాం రైఫిల్స్, ఐటీబీపీ బృందాల జాయింట్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లో మరో 2 మృతదేహాలను గుర్తించాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం 11 మృతదేహాలు లభించాయి.
అక్టోబరు 18న వీరు తిరుగు ప్రయాణం అవుతుండగా.. వాతావరణ పరిస్థితుల కారణంగా భారీగా మంచు కురియడంతో మంచు చరియలు విరిగిపడ్డాయి. దీంతో వారంతా గల్లంతయ్యారని పోలీసులు తెలిపారు. గల్లంతైన మిగతావారి కోసం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు తెలిపారు. ఈ ఘటన పదకొండు మంది కుటుంబాలో తీవ్ర విషాదాన్ని నింపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com