Uttarpradesh : చిన్నారి ప్రాణాలు తీసిన అధికారుల కాఠిన్యం

uttarpradesh
Uttarpradesh : చిన్నారి ప్రాణాలు తీసిన అధికారుల కాఠిన్యం
సెలవు ఇవ్వని అధికారులు; అనారోగ్యంతో ఉన్న భార్య; ఆడుకునేందుకు బయటకు వెళ్లి మృత్యువాత పడిన రెండేళ్ల చిన్నారి


కఠినత్వం అనేది కొన్ని విషయాల్లో ఆమోదయోగ్యంగానే ఉంటుంది. శృతి మించితే మాత్రం ఊహించని పరిస్థితులకు దారితీస్తుంది. అలాంటి ఘటననే ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. మథుర ప్రాంతానికి చెందిన సోనూ చౌధరీ... బైద్ పూర్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. ఆయన భార్యకు ఆపరేషన్ జరుగగా వారికి రెండేళ్ల బాబు ఉన్నాడు. దీంతో భార్యను, కోడుకును చూసుకోవడానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తనకు సెలవు కావాలని ఈనెల 7 తేదీన తన పై అధికారులను కోరాడు. అబద్దపు కారణాలతో సెలవు కోరుతున్నాడనుకున్న పై అధికారులు సోనూ చౌధరీకి లీవ్ ఇవ్వలేదు.

భార్యా బిడ్డలను జాగ్రత్తగా ఉండమని బుధవారం విధులకు హాజరయ్యాడు సోనూ చౌధరీ. అనారోగ్యంతో ఉన్న సోనూ భార్య విశ్రాంతి తీసుకుంటుండగా వారి రెండేళ్ల బాబు బయట ఆడుకోవడానికి వెళ్లాడు. ఎంతకీ తిరిగి రాకపోయేసరికి సోనూ భార్య అతికష్టం మీద బయటకు వెళ్లి చూడగా పక్కనే ఉన్న గుంటలో ప్రాణం లేకుండా పడిఉన్నాడు.

ఒకవైపు ఆపరేషన్ చేయించుకుని నడవడమే కష్టంగా ఉన్న తల్లి.. మరోవైపు గుంటలో చలనంలేకుండా పడి ఉన్న బాబు. ఈ పరిస్థితిలో కూడా శక్తిని కూడ గట్టుకుని బాబును గుంటలో నుంచి పైకి తీసి హాస్పిటల్ కు పరుగు పెట్టింది. అప్పటితే సోనూ చౌధరీ విషయం తెలుసుకుని హాస్పిటల్ కు వెళ్లాడు. బాబును పరిశీలించిన డాక్టర్లు అప్పటికే ప్రాణం పోయిందని చెప్పారు.

అదే పార్థీవదేహంతో, ఆపరేషన్ అయిన భార్యను తీసుకుని జిల్లాఎస్పీ ఆఫీస్ మెట్లు ఎక్కాడు కానిస్టేబుల్ సోనూ చౌధరీ. తాను సెలవుల కోసం అబద్దం ఆడలేదని తన భార్య నిజంగానే అనారోగ్యంతో ఉందని నిరూపణ ఇచ్చాడు. తాను ఇంటి పట్టున లేని కారణంగా తన కొడుకు గుంటలో పడి చనిపోయాడని దిక్కులు పిక్కటిల్లేలా రోధించాడు. అయినా చేయి దాటిపోయిన ఘటనకు బాధ్యులెవరు అన్నట్లుగా ప్రకృతి చూస్తూ ఊండిపోయింది. చివరకు విచారణకు ఆదేశించారు జిల్లా ఎస్సీ.

Tags

Read MoreRead Less
Next Story