Corona vaccine : కోవిడ్ నుంచి కోలుకున్నాక 3 నెలల తర్వాత వ్యాక్సిన్

Corona vaccine : కరోనా సోకిన వారు 3 నెలల తర్వాత కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చని కేంద్రం తాజాగా వెల్లడించింది. గతంలో ఇది 45 రోజులుగా ఉండేది. ఇక తొలి డోస్ తీసుకున్నాక కోవిడ్ సోకిన వారు కూడా రెండో డోసును 3 నెలల తర్వాత తీసుకోవాలని సూచించింది. ఇక ప్లాస్మా చికిత్స తీసుకున్నవారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మూడు నెలల తర్వాత టీకా వేయించుకోవాలని పేర్కొంది. కొవిడ్ నుంచి కోలుకున్నవారు, టీకా తీసుకున్నవారు 14 రోజుల తర్వాత రక్తదానం చేయొచ్చునని తెలిపింది. వ్యాక్సినేషన్‌కు ముందు టీకా తీసుకునేవారికి ఎలాంటి రాపిడ్ యాంటీజెన్ పరీక్షలు అవసరం లేదంది. అయితే గర్భిణీలకు కొవిడ్ టీకా అంశంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని తెలిపింది. కోవిడ్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ పై ఏర్పాటైన జాతీయ నిపుణుల కమిటీ ఈ మేరకు సూచనలు చేయగా కేంద్ర ఆరోగ్య శాఖ వాటిని ఆమోదించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com