Valentine's Day : ప్రేమికుల రోజు కుక్కలకు పెళ్లి

ప్రేమికుల రోజుకు నిరసనగా కుక్కలకు పెళ్లి చేసిన ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. తమిళనాడు లోని శివగంగలో కుక్కలకు 'మాక్ మ్యారేజ్' వేడుకలను నిర్వహించారు. తమిళనాడుకు చెందిన 'హిందు మున్నాని' అనే సంస్థ వాలెంటెన్స్ డే పై నిరసన వ్యక్తం చేసింది. భారతదేశ సంస్కృతికి వ్యాలెంటైన్స్ డే వేడుక విరుద్ధమైనదని పేర్కొంది. ఈ సంస్థకు చెందిన సభ్యులు ప్రతి సంవత్సరం వివిధ రూపాల్లో నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి కుక్కలకు పెళ్లి చేశారు.
'హిందు మున్నాని' కార్యకర్తలు సోమవారం రెండు కుక్కలను తీసుకొచ్చి వాటికి దుస్తులు, పూలమాలలతో అలంకరించారు. రెండు కుక్కలకు కలిపి ఒకే తాడుతో కట్టేశారు. ప్రేమికుల రోజున బహిరంగ ప్రదేశాలలో ప్రేమికులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారని అందుకు నిరసనగానే కుక్కలకు పెళ్లి చేశామని హిందు మున్నాని కార్యకర్తలు తెలిపారు. కుక్కలకు రోడ్డు, ఇళ్లు అనే తేడా ఉండదని, మనుషులకు మాత్రం నాగరికత ఉందని అన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com