వామ్మో.. ఇదేంది అబ్బయా.. ఈ కూరగాయ కిలో లచ్చరూపాయలా!!

వామ్మో.. ఇదేంది అబ్బయా.. ఈ కూరగాయ కిలో లచ్చరూపాయలా!!
X
ఏం తినేటట్టులేదు.. ఏం కొనేటట్టు లేదని ఆకాశాన్నంటుతున్న ధరలను చూసి వాపోవడం సామాన్యుడి వంతు. మరి పేరు కూడా వెరైటీగా ఉన్న ఈ 'హాఫ్ షూట్స్' కూరగాయ ధర ఎంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం.

ఏం తినేటట్టులేదు.. ఏం కొనేటట్టు లేదని ఆకాశాన్నంటుతున్న ధరలను చూసి వాపోవడం సామాన్యుడి వంతు. మరి పేరు కూడా వెరైటీగా ఉన్న ఈ 'హాఫ్ షూట్స్' కూరగాయ ధర ఎంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. పెద్ద చదువులు చదివినా తినే ఆ నాలుగు మెతుకుల కోసమే కదా కష్టపడి ఉద్యోగాలు చేసేది అని భావించాడో ఏమో.. ఇంటర్‌తో చదువు ఆపేసి ఇష్టంగా వ్యవసాయం చేస్తున్నాడు, ఖరీదైన కూరగాయలు పండిస్తున్నాడు.

బీహార‌కు చెందిన ఓ యువ రైతు తాను పండించే కూరగాయల్లో కిలో లక్ష రూపాయల ధర పలికేవి కూడా ఉన్నాయని చెబుతున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పంట అయిన 'హాఫ్ షూట్స్‌'ని సాగు చేస్తున్నాడు. ఐఎఎస్ అధికారి సుప్రియా సాహు.. ఈ పంటకు సంబంధించిన పలు చిత్రాలను ట్వీట్ చేశారు. ఈ కూరగాయ ధర కిలోకు రూ.1లక్ష ఖర్చవుతుంది. భారతీయ రైతుల్లో మార్పు ఆరంభమవుతోంది అని ఆమె ట్వీట్‌లో రాసుకొచ్చారు.

అమ్రేష్ సింగ్ అనే బీహార్ రైతు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పంట అయిన 'హాప్ షూట్స్' సాగు చేస్తున్నారు. ఈ మొక్క యొక్క ప్రతి భాగం ఉపయోగించదగినది. 'హాప్ షూట్స్' లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి

బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలోని కరంనిధ్ గ్రామానికి చెందిన రైతు అమ్రేష్ సింగ్ (38) భారతదేశంలో ఇంత కాస్ట్లీ పంట పండించిన మొదటి వ్యక్తి. అమ్రేష్ వారణాసిలోని ఇండియన్ వెజిటబుల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి మొక్కలను కొనుగోలు చేశాడు. ఇప్పటివరకు భారతీయ మార్కెట్లలో ఇంత రేటు గల అరుదైన కూరగాయని ఎవరూ అమ్మలేదు.

ప్రత్యేక ఆర్డర్ ద్వారా మాత్రమే ఈ హాఫ్ షూట్స్ అందించబడతాయి.రైతులు ఆర్థికంగా ఎదగడానికి ఇది సహాయపడుతుంది కాబట్టి హాప్స్ సాగును ప్రోత్సహిస్తున్నారు. అధ్యయనాల ప్రకారం, మొక్క యొక్క ప్రతి భాగం పండు, పువ్వు నుండి కాండం వరకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఇది బీర్ పరిశ్రమకు చాలా ఉపయోగపడుతుంది. క్షయవ్యాధిని నివారించేందుకు ఇది సహజ నివారణిగా పని చేస్తుంది.

కూరగాయలలో లభించే యాంటీఆక్సిడెంట్లు చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తాయి. రెమ్మలు ఆందోళన, నిద్రలేమి మరియు నిరాశను తగ్గించడానికి ఉపయోగపడతాయి. హాప్ షూట్స్ రెమ్మలు కోయడం అంత సులభం కాదు. ఇవి చాలా ఖరీదైనవి కావడానికి ఇది కూడా మరొక కారణం. వాటిని తీయటానికి ఎక్కువ గంటలు కష్టపడాలి. మన దేశంలో ఈ పంట సాగును ప్రధాని నరేంద్ర మోదీ ప్రోత్సహించాలని అంటున్నాడు. ఇలాంటి పంటల ద్వారా రైతుల ఆదాయం 10 రెట్లు పెరుగుతుందని అమ్రేష్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. యూరప్ దేశంలో ఈ పంటను విస్తారంగా సాగు చేస్తారు.

Next Story