ప్రియాంక కాన్వాయ్‌కి ప్రమాదం.. కారుదిగి అద్దాలు తుడిచి..

యుపిలో పర్యటిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా గురువారం జాతీయ రహదారి 24 లోని హాపూర్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కాన్వాయ్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. అయితే ఆమెకు ఎటువంటి గాయాలు సంభవించలేదని, ప్రియాంక గాంధీ గాయపడకుండా తప్పించుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. గురువారం ఉదయం కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కాన్వాయ్ ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్ వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఢిల్లీని లక్నోతో కలిపే రహదారిపై కాంగ్రెస్ నాయకురాలి కాన్వాయ్‌లోని నాలుగు వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నట్లు సమాచారం. హపూర్ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని, వాహనాలకు స్వల్ప నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. ప్రియాంక కారు ముందు భాగంలోని వైపర్లు పనిచేయకపోవడంతో డ్రైవర్ ఇబ్బంది పడుతూ కారును మెల్లగా పోనిచ్చారు. అదే సమయంలో వెనుక ఉన్న వాహనాలు ప్రియాంక వాహనాన్ని ఢీకొట్టాయి. దాంతో కారులో నుంచి దిగిన ప్రియాంక ఓ బట్ట తీసుకుని కారు అద్ధాలను శుభ్రం చేస్తున్నారు. అనంతరం దిబ్ధిబా గ్రామానికి వెళ్లారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com