Venkaiah Naidu Emotional :రాజ్యసభలో వెంకయ్యనాయుడుపై విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు!

Venkaiah Naidu Emotional :రాజ్యసభలో వెంకయ్యనాయుడుపై విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు!
రాజ్యసభలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీ మనసు బీజేపీతో, తనువు టీడీపీతో ఉందని విజయసాయిరెడ్డి అన్నారు.

రాజ్యసభలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీ మనసు బీజేపీతో, తనువు టీడీపీతో ఉందని విజయసాయిరెడ్డి అన్నారు. విజయసాయి వ్యాఖ్యలకు వెంకయ్యనాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఉపరాష్ట్రపతి ప్రతిపాదన వచ్చిన వెంటనే పార్టీకి రాజీనామా చేశానని.. అప్పటి నుంచి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదన్నారు వెంకయ్యనాయుడు. తన హృదయం దేశ ప్రజలతో మమేకమై ఉందని.. ఎవరు ఏమన్నా పట్టించుకోనన్నారు వెంకయ్యనాయుడు. వ్యక్తిగతంగా విజయసాయి వ్యాఖ్యలు బాధించాయని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం జగన్ పై సభలో కనకమేడల ఆరోపణలను రికార్డుల నుంచి తొలగించాలని విజయసాయిరెడ్డి పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను లేవనెత్తగా.. దాన్ని వెంకయ్యనాయుడు తోసిపుచ్చారు. దీంతో నిరసనగా వెల్‌లోకి వైసీపీ ఎంపీలు వెళ్లారు.

Tags

Next Story