విద్యార్థుల ఉన్నతికి పాటు పడిన గురువులను మరవకూడదు : వెంకయ్య నాయుడు
దేశ వ్యాప్తంగా , గ్రామీణ ప్రాంతాల్లో అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్య వసతులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు .హైదరాబాద్ మ్యారియట్ హోటల్‌లో ఉపాధ్యాయ దినోత్సవంను పురస్కరించుకుని అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అక్రిడెటెడ్ ఇన్‌స్టిట్యూట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన 11 వ వార్షిక వైద్య అధ్యాపకుల అవార్డుల ప్రధానోత్సవంలో ఆయన పాల్గొన్నారు . వైద్య కళాశాలలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని ..ప్రతి జిల్లా కేంద్రంలో ఒక వైద్య కళాశాలలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు .వైద్య విద్యతో పాటు వైద్యం సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు .ఉపాధ్యాయ దినోత్సవంను పురస్కరించుకుని వైద్య విద్యను బోధించే ఉపాధ్యాయులకు అవార్డులను అందించారు.
హైదరాబాద్ లో ఎ.ఎన్.బి.ఎ.ఐ. నిర్వహించిన 11వ వార్షిక వైద్య అధ్యాపకుల అవార్డుల ప్రదానోత్సవంలో భారత గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు. #TeachersDay pic.twitter.com/dPwcTP7eya
— Vice President of India (@VPSecretariat) September 5, 2021
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com