భవిష్యత్తులో కూడా ఇలాంటివి డిజైన్ చేయము.: ఆనంద్ మహీంద్రా

భవిష్యత్తులో కూడా ఇలాంటివి డిజైన్ చేయము.: ఆనంద్ మహీంద్రా
దొరికినప్పుడు చూద్దాంలే అని బే ఫికర్‌తో బతికేస్తుంటారు అక్రమార్కులు. కానీ వాహనాల్లో కూడా అండర్ గ్రౌండ్ స్టోరేజీని ఏర్పాటు చేసి నగదును నిల్వ చేసిన..

అడ్డదారుల్లో సంపాదించిన అక్రమ ఆస్తులను అండర్ గ్రౌండ్లో దాస్తుంటారు. దొరికినప్పుడు చూద్దాంలే అని బే ఫికర్‌తో బతికేస్తుంటారు అక్రమార్కులు. కానీ వాహనాల్లో కూడా అండర్ గ్రౌండ్ స్టోరేజీని ఏర్పాటు చేసి నగదును నిల్వ చేసిన వీడియోని చూసి అవాక్కయ్యారు ఆనంద్ మహీంద్రా.. ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా సీఈవో ఆనంద్ మహీంద్రా దీని గురించి ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. నేను, నా కంపెనీ ఇంకా ఇంత ఎదగలేదురా బాబు.. భవిష్యత్తులో కూడా ఇలాంటి పనులకు మా వాహనాలను ఉపయోగించబోము అంటూ ట్వీట్ చేశారు.

ఆయన షేర్ చేసిన వీడియో చూస్తే.. వీడియోలో ముందు ఓ ట్రక్కు కనిపిస్తుంది. పోలీసులు అ ట్రక్కును పట్టుకుని సోధించగా వారికి ట్రక్కు క్రింది భాగంలో ఓ డ్రా బయటపడింది. బయటకు కనిపించకుండా అమర్చిన ఆ డ్రాలో వందల సంఖ్యలో మద్యం బాటిళ్లు, కార్టన్లు దర్శనమిచ్చాయి. ఈ వీడియో చూసిన వారంతా వీరి అతి తెలివికి విస్తుపోతున్నారు. దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. తమ పికప్ ట్రక్ డిజైనింగ్‌లో ఇది భాగం కాదని, భవిష్యత్‌‌లోనూ ఇలాంటి వాటిని డిజైన్ చేయమని స్పష్టం చేశారు. అయితే ఇది ఎక్కడ జరిగింది అనేది మాత్రం వివరించలేదు.


Tags

Read MoreRead Less
Next Story