ముహూర్తం ఖరారు.. రాములమ్మ..!!

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌గా ఉన్న మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్న ఆమె పార్టీకి గుడ్‌బై చెప్పారు. త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు వస్తున్న వార్తలకు తెరదించనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత ఆమె గ్రేటర్‌లో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నట్లు సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో మంగళవారం రాములమ్మ బీజేపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి చర్చించారు. కాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టి ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ విజయశాంతిని పార్టీ మారకుండా చూసేందుకు ప్రయత్నించారు. కానీ చర్చలు సఫలం కాకపోవడంతో రాములమ్మ బీజేపీలో చేరే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com