రూ. 50 వేలు ఇచ్చి మొసలిని విడిపించుకోండి

రూ. 50 వేలు ఇచ్చి మొసలిని విడిపించుకోండి
మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాం.. 5 లక్షలు ఇచ్చి మీ అబ్బాయిని తీసుకొనిపోండి. ఎవరికైనా చెబితే మీ అబ్చాయి మీకు దక్కడు.

మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాం.. 5 లక్షలు ఇచ్చి మీ అబ్బాయిని తీసుకొనిపోండి. ఎవరికైనా చెబితే మీ అబ్చాయి మీకు దక్కడు. ఇలాంటి డైలాగ్స్ తరుచూ సినిమాల్లో వింటూ ఉంటాం. బయట కూడా అడపాదడపా ఇలాంటి వార్తలు వినిపిస్తాయి. కానీ, ఉత్తరప్రదేశ్‌లో ఓ గ్రామస్తులు మొసలిని అప్పగించేందుకు రూ. 50 వేలు డిమాండ్ చేశారు. అయితే, దీనిని వారు కిడ్నాప్ చేయలేదు. ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు ఓ 8అడుగులు మొసలి లఖింపూర్ ఖేరీ జిల్లాలో మిదానియా గ్రామంలోని ఓ కొలనులో ప్రత్యక్షమైంది. గ్రామస్థులు కష్టబడి దాన్ని పట్టుకొని అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు గ్రామస్తుల డిమాండ్ చూసి కంగు తిన్నారు. తాము ప్రాణాలకు తెగించి ఈ మొసలిని పట్టుకున్నామని.. కనుక రూ.50వేలు ఇచ్చి మొసలిని విడిపించుకుపోవాలని అన్నారు. అయితే, అటవీ అధికారులు స్థానిక పోలీసులను సంప్రదించి గ్రామస్తులను ఎలాగో ఒకలా ఒప్పించి మొసలిని తీసుకొనిపోయారు. దీనిపై మాట్లాడిన ఓ అధికారి వన్యప్రాణ సంరక్షణ చట్టంపై అవగాహనలేకపోవడంతో గ్రామస్తులు ఇలా మాట్లారని.. ప్రతీ ఒక్కరికీ ఈ చట్టం మీద అవగాహన అవసరం అని అన్నారు.

Tags

Next Story