Vinesh Phoghat : రచ్చ అంతా ఇతడి గురించే...

Vinesh Phoghat : రచ్చ అంతా ఇతడి గురించే...
లైంగిక ఆరోపణలు... ఎవరీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్..?



భారత మహిళా రెజ్లర్లు రోడ్డెక్కారు. 'రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా' (WFI)అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, మహిళా రెజ్లర్ లను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. స్థార్ రెజ్లర్లు వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, సుమిత్ మల్లిక్, బజరంగ్ పునియా... వరుసగా రెండో రోజు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్నారు. WFIచీఫ్ శరణ్ సింగ్ తో పాటు కోచ్ లు కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మహిళా రెజ్లర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సీరియస్ గా తీసుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య ( WFI) 72 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

గతంలో హోం మంత్రి అమిత్ షాను కలిసి వినతి పత్రం అందించామని తెలిపారు వినేష్ ఫోగట్. అప్పటినుంచి తమను మానసికంగా శరణ్ సింగ్ వేధిస్తున్నాడని చెప్పారు. వేధింపులు తట్టుకోలేక తాము ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు తెలిపారు.

ఎవరీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్..?

ఉత్తర్ ప్రదేశ్ గోండా జిల్లాకు చెందిన బ్రిజ్ భూషన్ చరణ్ సింగ్ యవ్వనంలో మల్లయోధుడు. 1980లో విద్యార్థి రాజకీయలలో చురుగ్గా పాల్గొన్నారు. రామమందిర ఉద్యమం జరుగుతున్న సమయంలో హిందుత్వ ఇమేజ్ కారణంగా స్థానికంగా పేరును సంపాదించారు. సమాజ్ వాద్ పార్టీ (SP)తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు శరణ్ సింగ్. 1991, 2009 లోక్ సభ ఎన్నికల్లో SPతరపున పోటీ చేసి గెలుపొందారు. 2014లో బీజేపీలో చేరి, 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు.

మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు వచ్చిన ఆరోపణలను బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఖండించారు. తాను లైంగిక వేధింపులు పాల్పడినట్లు నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటానని అన్నారు. వినేష్ ను చంపేస్తానని బెదింపులకు పాల్పడటం కూడా అబద్దమని చెప్పారు. రెజ్లింగ్ సమాఖ్యలో కొత్త పాలసీ, నిబంధనలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. పాలసీ, రెజ్లర్లకు నచ్చకపోవడంతో ఆందోళన చేస్తున్నారని అన్నారు.

Tags

Next Story