నాకోసం నువ్విలా.. వధువుని చూసి కంట తడిపెట్టిన వరుడు

పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో మరచిపోలేని మధురమైన రోజు. భవిష్యత్‌లో పెళ్లినాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ తన్మయత్వానికి గురవుతారు. అంతే కాకుండా, ఇది మొదటి నుండి చివరి వరకు భావోద్వేగాలతో నిండిన రోజు కూడా.
ఇటీవల జరిగిన ఒక వివాహ వేడుకలో వరుడు.. వివాహ వస్త్రధారణలో పెళ్లి మంటపానికి వస్తున్న వధువు అందాన్ని చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఏడుస్తున్న వరుడి కంటే మీ హృదయాన్ని ఏది కరిగించగలదు? అంటూ ఈ భావోద్వేగ క్షణాలను కెమెరాలో బంధించాడు ఫోటోగ్రాఫర్. ఇప్పుడు ఈ వీడియోసోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతోంది.
అందంగా ముస్తాబై వస్తున్న వధువును చూసిన ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న వీడియో మొదట వెడ్డింగ్‌వైర్ ఇండియా అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయబడింది. దానికి ఒక క్యాప్షన్ కూడా జత చేసి పోస్ట్ చేశారు. "రెండు కుటుంబాలను ఒకటి చేసే పెళ్లి. ప్రియ సఖి చేయి పట్టుకోవాలనే మీ కల ఇప్పుడు నిజమవుతోందని తెలిసి మీరు కార్చిన ఆ కన్నీళ్లు మీ హృదయ స్పందనలు.. ఆ భావానికి అభినందనలు" అని రాసుకొచ్చారు.
ఈ చిన్న వీడియో క్లిప్‌లో, వరుడు తన వివాహ వస్త్రధారణలో ఆమె కోసం ఎదురుచూస్తున్నప్పుడు వధువు తన వివాహ దుస్తులలో అందంగా అలంకరించబడి వేదిక వైపు నడిచి వస్తున్న దృశ్యాన్ని చూడవచ్చు. వరుడు తన జీవితపు భాగస్వామిని ప్రేమ బంధంతో ముడి వేయడానికి ముందు ఎంతో భావోద్వేగానికి గురైన అపురూప దృశ్యాన్ని మనం చూడవచ్చు. మరియు, ఈ వీడియో ఖచ్చితంగా మీ హృదయాన్ని కూడా కరిగించి, కన్నీళ్లు తెప్పిస్తుందని భావిస్తున్నాము అని వెడ్డింగ్ వైర్ ఇండియాలో రాసుకొచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com