ఆ మధుర క్షణాలను మిస్సవను: కోహ్లీ

చిన్నప్పుడు నాన్న బంతి వేస్తుంటే ప్లాస్టిక్ బ్యాట్‌తో కొట్టిన రోజులు ఇంకా గుర్తున్నాయి. ఆయన మరణించిన రోజే క్రికెట్‌ను కెరీర్‌గా తీసుకోవాలనుకున్నానని టీమిండియా రధసారథి విరాట్ కోహ్లీ అన్నారు. తన ధ్యాసంతా ఆటమీదే కేంద్రీకరించానని అన్నారు. ఎలాగైనా టీమ్ ఇండియాకు ఆడాలనుకున్నానని తాజాగా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌తో మాట్లాడుతూ తన మనసులోని భావాలను పంచుకున్నారు.
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు పూర్తయ్యాక భారత్‌కు తిరిగి వచ్చే ఆలోచనతో ఉన్నానని చెప్పారు. జనవరిలో భార్య అనుష్క తొలిసారి బిడ్డకు జన్మనివ్వబోతోన్న ఆనంద క్షణాలను తనతో కలిసి పంచుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. దేశం తరపున ఆడాలనే కోరిక ఎలా ఉంటుందో.. ఇది కూడా అలాంటిదే అని అన్నారు. జీవితంలో ఇదో ప్రత్యేకమైన సందర్భమని అన్నారు. అనుష్క డెలివరీ సమయంలో తనపక్కనే ఉండాలనుకుంటున్నట్లు చెప్పారు.
తమ జీవితంలోకి వచ్చే మొదటి బిడ్డ కోసం ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. తాను భారత్‌కు తిరిగి వచ్చాక రహానే జట్టు పగ్గాలు చేపడతాడని, అతడికి నాయకత్వం చేయాలంటే ఇష్టమని వివరించాడు. అతడికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడనే నమ్మకం ఉందని కోహ్లీ తెలిపాడు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com