వోకల్ ఫర్ లోకల్‌కు అనూహ్య స్పందన.. చైనాకు రూ.40 వేల కోట్లు నష్టం!

వోకల్ ఫర్ లోకల్‌కు అనూహ్య స్పందన.. చైనాకు రూ.40 వేల కోట్లు నష్టం!

వోకల్ ఫర్ లోకల్, లోకల్ ఫర్ దీవాళి అన్న ప్రధాని మోదీ నినాదానికి అనూహ్య స్పందన వచ్చింది. ఈ దీపావళికి రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ఏకంగా 72 వేల కోట్ల మేర అమ్మకాలు జరిగినట్టు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ తెలిపింది. అంతేకాదు... చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న నినాదం సైతం బాగా పనిచేసింది. దీంతో ఆ దేశానికి రూ.40 వేల కోట్ల మేర నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఈసారి ప్రజలంతా స్వదేశీ వస్తువుల్ని కొనేందుకు ఇష్టపడ్డారు.

దేశంలో ప్రముఖ పంపిణీ కేంద్రాలుగా ఉన్న 20 నగరాల డేటా ప్రకారం దీపావళి పండుగ అమ్మకాల టర్నోవర్ 72 వేల కోట్లుగా ఉన్నట్టు సీఏఐటీ పేర్కొంది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, నాగ్‌పూర్, రాజ్‌పూర్, భువనేశ్వర్‌ తదితర నగరాల డేటాను తీసుకుంది సీఏఐటీ. వాణిజ్య మార్కెట్‌లో ఈ అమ్మకాలు భవిష్యత్తులో మంచి వ్యాపార అవకాశాలను సూచిస్తాయని వెల్లడించింది. ప్రధానంగా బొమ్మలు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వస్తువులు, గోల్డ్, ఫుట్ వేర్, వాచ్‌లు వంటివి ఎక్కవగా కొనగోలు చేశారు.


Tags

Next Story