తెలుగు ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు: ఉపరాష్ట్రపతి వెంకయ్య

X
By - TV5 Digital Team |13 Jan 2021 11:30 AM IST
సంక్రాంతి సందర్భంగా కుటుంబ సమేతంగా గోవాలోని రాజ్ భవన్‌లో భోగిమంట వేడుకలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు.
తెలుగు ప్రజలందరికీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా కుటుంబ సమేతంగా గోవాలోని రాజ్ భవన్‌లో భోగిమంట వేడుకలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. చిన్నా పెద్దా అంతా కలిసి ఆనందో త్సాహాలతో వేసే భోగి మంటలు ప్రతికూల ఆలోచనలను వదలి సానుకూల దృక్ఫథంతో ముందుకు సాగాలనే సందేశాన్నిస్తాయన్నారు. భోగి అందరి జీవితాల్లోకి భోగభాగ్యాలను, ఆయురారోగ్యాలను తీసుకురావాలని ఆకాంక్షించారు.
సంక్రాంతి సందర్భంగా కుటుంబ సమేతంగా గోవా లోని రాజ్ భవన్ లో భోగి మంట వేస్తున్న గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు శ్రీమతి ఉషమ్మ. #Bhogi pic.twitter.com/INkq7A8mms
— Vice President of India (@VPSecretariat) January 13, 2021
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com