Tamil Nadu Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తమిళనాడుతో పాటు మరో రాష్ట్రంలో భారీ వర్షాలు..
Tamil Nadu Rains (tv5news.in)
Tamil Nadu Rains: దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా మారింది. చెన్నైకి 430 కిలోమీటర్లు, పాండిచ్చేరికి 420 కిలోమీటర్ల దూరంలో తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమైంది. ఇవాళ ఉదయం చెన్నై- మహాబలిపురం వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఏపీ, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే చెన్నైలో అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై సహా 15 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. చెన్నై, విల్లుపురం, చెంగల్‌పట్టు, తిరువళ్లూర్, కడలూరు, కాల్వకురిచ్చిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాన్నీ జలదిగ్భందమయ్యాయి.
చెన్నైలో ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. కావేరీ, వైగై, థెన్, పెన్నై, భవానీ నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో.. నదీ పరివాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇటు ఎయిర్‌పోర్ట్, ఆర్.ఏ.పురం, బీచ్ రోడ్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో పలు విమానాలు రద్దు అయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంతో 12 జిల్లాలకు సెలవులు ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com