భవానీపూర్ ఉపఎన్నికకు నామినేషన్ వేసిన దీదీ..!

X
By - /TV5 Digital Team |10 Sept 2021 6:00 PM IST
గత ఎన్నికలో సువేందుపై పోటీ చేసి ఓడిన మమత.. తన సొంత నియోజకవర్గం అయిన భవానీపూర్‌లో తిరిగి పోటీ చేస్తోంది. ఇప్పటికే నామినేషన్ కూడా దాఖలు చేశారు.
బెంగాల్‌లో మరోసారి మమతపై సై అంటోంది బీజేపీ. గత ఎన్నికలో సువేందుపై పోటీ చేసి ఓడిన మమత.. తన సొంత నియోజకవర్గం అయిన భవానీపూర్‌లో తిరిగి పోటీ చేస్తోంది. ఇప్పటికే నామినేషన్ కూడా దాఖలు చేశారు. మరోవైపు బీజేపీ అభ్యర్ధిగా ప్రియాంక టిబ్రివాల్‌ను బరిలో దింపుతోంది. ఈ ఎన్నికలో మమతను ఓడిస్తామంటోంది కమలదళం. భవానీపూర్‌లో ప్రచారానికి ఎంపీలతో సహా ప్రముఖ నేతలను రంగంలోకి దింపబోతోంది. వార్డుల్లో ప్రచారానికి ఎమ్మెల్యేలను దింపుతోంది. ఈనెల 30న భవానీపూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. మమతపై పోటీకి అభ్యర్ధిని నిలబెట్టకూడదని కాంగ్రెస్ నిర్ణయించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com