జోరుగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారం..!

పశ్చిమ బెంగాల్ ఎన్నికల జోరందుకుంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్ని తానై ప్రచారం నిర్వహిస్తుండగా.. కమలనాథులు మాత్రం ఏకంగా కేంద్ర మంత్రులను రంగంలోకి దింపి ప్రచారం సాగిస్తున్నారు. ప్రధాని మోదీ,హోంమంత్రి అమిత్ షాలు ప్రచారం చేపట్టారు. రాష్ట్రంలోని వెనుక బడిన తరగతులపై దీదీ బహిరంగ యుద్దం ప్రకటించారని ప్రధాని విమర్శించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని ఒక్కసారైనా మమతాబెనర్జీ అన్నారా అని నిలదీశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికార టీఎంపీపై విమర్శల చేశారు. ఎన్నార్సీ అమలు చేయడం వల్ల గుర్ఖాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఎన్నార్సీ అమలుచేయడం వల్ల గూర్ఖాలు ఇబ్బందులు పడుతారని ప్రచారం నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మమత ఎన్నికల ప్రచారంలో బెంగాల్ కంటే తన పేరునే ఎక్కువ సార్లు ప్రస్తావిస్తున్నారని ఎద్దేవాచేశారు.
మరోపైపు ప్రచారంలో దూసుకుపోతున్న సీఎం మమతా బెనర్జీ ఎలక్షన్ క్యాంపెయిన్ ఎన్నికల సంఘం 24 గంటల పాటు నిషేధం విధించింది. ఆమె ఇటీవల ఎన్నికల ప్రచార సభలో చేసిన వ్యాఖ్యలను ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా ఈసీ పరిగణిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం రాత్రి 8 గంటల నుంచి మంగళవారం రాత్రి 8 గంటల వరకూ ఈ నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.
రాష్ట్రంలో ముస్లీం ఓటర్లంతా టీఎంసీకి ఓటు వేయాలని ఇటీవల ఎన్నికల ప్రచారంలో మమత పిలుపునివ్వడం సంచలనంగా మారింది. బెంగాల్‌లో 8వ విడతల పోలింగ్‌లో భాగంగా ఇంతవరకూ నాలుగు విడతలు పూర్తయ్యాయి. ఐదో విడత పోలింగ్ ఈనెల 17న జరుగనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com