కోర్టు స్టే ఇచ్చిన భూమిని ఇళ్ల స్థలాలకు.. రైతుల ఆగ్రహం

కోర్టు స్టే ఇచ్చిన భూమిని ఇళ్ల స్థలాలకు.. రైతుల ఆగ్రహం
కోర్టు స్టే ఉండగా బలవంతంగా భూములు ఎందుకు కొలుస్తున్నారంటూ

భూములు బలంవంతంగా లాక్కుని ఇళ్ల స్థలాలకు కేటాయించడంపై రైతులు ఎదురుతిరిగారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో.. కోర్టు స్టే ఇచ్చిన భూమిని ఇళ్ల స్థలాలకు కేటాయించడానికి అధికారులు ప్రయత్నించారు. కోర్టు స్టే ఉండగా బలవంతంగా భూములు ఎందుకు కొలుస్తున్నారంటూ రైతులు ఎదురు తిరిగారు.

ఇద్దరు యువకులు వంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడానికి ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా కోర్టు స్టే ఉన్న భూమిని బలవంతంగా గుంజుకుంటున్నారని వైసీపీ నాయకులపై, రెవెన్యూ, పోలీసు అధికారులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story