West Bengal : మైనారిటీ వ్యవహారాల మంత్రిని తొలగించిన సీఎం మమత

పశ్చిమ బెంగాల్ మైనారిటీ వ్యవహారాల మంత్రి గులాం రబ్బానీపై వేటు వేశారు సీఎం మమతా బెనర్జీ. మైనారిటీ వ్వవహారాల శాఖ నుంచి ఉద్యానవన శాఖకు బదిలీ చేశారు. సోమవారం ఇందుకుగాను నిర్ణయం తీసుకున్నారు. సాగర్‌దిగి అసెంబ్లీ ఉప ఎన్నికలో తృణముల్ ఓటమి కారణంగా ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత నెలలో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ నేత బేరాన్ బిస్వాస్ టీఎంసీపై విజయం సాధించారు. రబ్బానీ సాగదీర్ ఉపఎన్నికకు ఇంచార్జ్ గా పనిచేశారు. పార్టీ ఆస్థానంలో ఓడిపోవడంతో సదరు మంత్రిని మరో మంత్రిత్వ శాఖకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి మైనారిటీ వ్యవహారాల శాఖను తనవద్దే ఉంచుకున్నారు మమత. గులాం రబ్బానీకి ఉద్యానవన శాఖకు బదిలీ చేశారు.
డిసెంబరు 2022లో తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నాయకుడు సుబ్రతా సాహా మరణంతో సాగర్‌డిఘి అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉపఎన్నికలో అధికార టీఎంసీ బదులు కాంగ్రెస్ గెలవడంతో మమత ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. సాంఘిక సంక్షేమ నిధుల కేటాయింపులో "రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతోందన్నారు మమత. మార్చి 29 మరియు 30 తేదీలలో కోల్‌కతాలోని బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన చేపట్టనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com