మరక మంచిదే.. ఆ ఫ్యాంటు ధర రూ.88,000 లు మరి..

ఫ్యాషన్ ట్రెండ్ మారుతోంది. చిరిగిన జీన్స్ ఫ్యాంట్లకు కాలం చెల్లిందేమో.. ఇప్పుడు మార్కెట్లోకి మరకలంటిన ఫ్యాంట్లు వస్తున్నాయి.. గుస్సీ గ్రాస్ స్టెయిన్ జీన్స్ పేరిట వస్తున్న ఈ బ్రాండ్ ఉత్పత్తులు యువతను ఆకర్షిస్తున్నాయి. ఇవి ఇతర బ్రాండ్లకు ధీటుగా ఓ ప్రత్యేకతను సంతరించుకునేలా కొత్తగా వీటిని డిజైన్ చేశారు. డిజైన్స్‌కి అనుగుణంగా ధర కూడా భారీగానే ఉంటుంది. ఆ విధంగా కూడా గుస్సీ ఉత్పత్తులు ప్రాచుర్యం పొందాయి. హై-ఎండ్ మరియు ప్రముఖ బ్రాండ్లలో ఒకటైన గుస్సీ, అధిక-నాణ్యమైన లెదర్ ఉత్పత్తులకు, అందమైన కలెక్షన్స్‌కు ప్రసిద్ధి చెందింది. గడ్డి మరకలతో రూపొందించిన ఈ జీన్స్ ధర రూ .88,000 గా నిర్ణయించింది కంపెనీ.
గుస్సీ.. బెల్ట్‌లు, జాకెట్లు, బ్యాగులు మరియు బూట్లకు ప్రసిద్ది చెందింది. ఈ కంపెనీ రూపొందించిన డిజైన్లకు ఎల్లప్పుడూ అధిక డిమాండ్ ఉంటుంది. కొత్తగా మార్కెట్లోకి వస్తున్న ఈ గుస్సీ జీన్స్ పై ఆకుపచ్చ రంగును కలిగి ఉంటుంది, అది గడ్డి మరకలా కనిపిస్తుంది. ఈ వైడ్-లెగ్ డెనిమ్ పంత్ సేంద్రీయ పత్తి నుండి రూపొందించబడింది, ప్రత్యేకంగా మరక అంటుకుందేమో అనే భావన కలిగేలా ఈ ఫ్యాట్లను డిజైన్ చేశారు ఫ్యాషన్ డిజైనర్లు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com