Makar Sankranti : మకర సంక్రాంతి రోజు మంగళకరమైన ఈ వస్తువులను దానం చేస్తే..

Makar Sankranti : మకర సంక్రాంతి రోజు మంగళకరమైన ఈ వస్తువులను దానం చేస్తే..
మకర సంక్రాంతి భారతదేశంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతాయి.

Makar Sankranti: మకర సంక్రాంతి భారతదేశంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతాయి. పల్లెల్లోని ప్రతి ఇల్లు కళకళలాడుతుంటుంది. మకర సంక్రాంతి పండుగను శుక్ల పక్షంలో జరుపుకుంటారు. సూర్య దేవుని పూజిస్తే శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ పండుగను వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో జరుపుకుంటారు.



కేరళలో మకర సంక్రాంతి, అస్సాంలో మాఘ బిహు, హిమాచల్ ప్రదేశ్‌లోని మాఘి సాజీ, జమ్మూలోని మాఘి సంగ్రాండ్ లేదా ఉత్తరాయణ (ఉత్తరాయణ), హర్యానాలోని సక్రత్, రాజస్థాన్‌లోని సక్రాత్, మధ్య భారత్‌లో సుకరత్ పొంగల్. ఉత్తరప్రదేశ్‌లో ఘుఘూటీ, బీహార్‌లో దహి చురా, ఒడిశాలో మకర సంక్రాంతి, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, పశ్చిమ బెంగాల్ లో పౌష్ సంక్రాంతి లేదా మోకోర్ సోంక్రాంతి అని కూడా పిలుస్తారు), ఉత్తరాఖండ్‌లో ఉత్తరాయణి అని, తమిళనాడులో పొంగల్, గుజరాత్‌లో ఉత్తరాయణ్ అని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో సంక్రాంతి, కశ్మీర్‌లో శిశుర్ సెంక్రత్ అని పిలుస్తారు.



పంచాంగం ప్రకారం, సూర్యుడు జనవరి 14, 2023 న రాత్రి 8.21 గంటలకు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో జనవరి 15న ఉదయ తిథి కారణంగా మకర సంక్రాంతిని జరుపుకోనున్నారు. మకర సంక్రాంతి నాడు ప్రతి ఇల్లు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. రంగుల రంగుల హరివిల్లులు ఆ ఇంటికి ప్రత్యేక అందాన్ని తీసుకువస్తాయి. మరి ఈ రోజు పేదలకు కొన్ని వస్తువులు దానం చేస్తే ఎంతో పుణ్యం ప్రాప్తిస్తుందని చెబుతారు. మీ రాశి ప్రకారం ఆయా వస్తువులను దానం చేస్తే ప్రతిఫలం అందుతుంది.


మకర సంక్రాంతి రాశి ప్రకారం ఏఏ వస్తువలను దానం చేయాలో తెలుసుకుందాం..

మేషం : బెల్లం, వేరుశెనగ, నువ్వుల లడ్డు

వృషభం : బియ్యం, పెరుగు, తెల్లటి బట్ట, నువ్వుల లడ్డు

జెమిని : బియ్యం, దుప్పట్లు (తెలుపు, ఆకుపచ్చ రంగులో ఉన్నవి), పెసర పప్పు

కర్కాటకం : వెండి, తెల్ల నువ్వులు లేదా కర్పూరం

సింహ : రాగి, గోధుమ, నువ్వులతో చేసిన తీసి పదార్ధం

కన్య : ఆకుపచ్చ రంగు దుప్పట్లు, కిచిడి (బియ్యం & పప్పుతో చేసిన పదార్థం)

తుల : చక్కెర, తెల్లటి బట్ట లేదా ఖీర్ లేదా కర్పూరం

వృశ్చికం : ఎర్రటి వస్త్రం లేదా నువ్వులు

ధనుస్సు : పసుపు వస్త్రం లేదా బంగారు వస్తువులు

మకరం: నల్ల దుప్పట్లు, నల్ల నువ్వులు

కుంభ: కిచిడి, నువ్వులు లేదా రాజ్మా

మీనం: పట్టు వస్త్రం, నువ్వులు

Tags

Read MoreRead Less
Next Story