ఈ పీడకల ఎప్పుడు ముగుస్తుంది: ప్రొఫెసర్ ఆవేదన

రాత్రి అమ్మకి దగ్గు వచ్చింది. నాన్న తుమ్మడం మొదలు పెట్టారు. దాంతో నాకు నిద్ర పట్టలేదు. ఎన్నో ఆలోచనలు.. ఎప్పుడు తెల్లవారుతుందా అని గడియారం కేసి ఎదురుచూపులు. ఆరయ్యిందో లేదో అమ్మ దగ్గరకి పరుగు అమ్మా.. ఇప్పుడు ఎలా ఉంది.. నాన్నా ఎలా ఉంది. జలుబుగా ఉందా.. ఏదో కంగారు.. కరోనా వచ్చిందేమో.. కాళ్లు చేతులు ఆడ్డం లేదు. తెలిసిన డాక్టర్ కి ఫోన్ చేస్తే ఏవో మెడిసిన్ చెప్పారు.
కాస్త రిలీఫ్ వచ్చినందని అమ్మా నాన్న చెప్పిన తరువాత మనసు కుదుట పడింది. మహమ్మారి మనుషుల్ని ముప్పుతిప్పలు పెడుతున్న ఈ సమయంలో ఏ మాత్రం ఏమరపాటు కనబరిచినా ఊహించుకోవడానికే భయంగా ఉంది. మిచిగాన్ విశ్వవిద్యాలయంలో భారతీయ అమెరికన్ ఎపిడెమియాలజీ ప్రొఫెసర్ భ్రమర్ ముఖర్జీ తన అంతరంగాన్ని ఆవిష్కరించారు.. ప్రస్తుత పరిస్థితిని చూసి దుఖంతో గొంతు పూడుకుపోతోంది అంటూ ఈ పీడకల ఎప్పుడు ముగుస్తుందో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
ఈఏడాది ఫిబ్రవరి 27 న మహారాష్ట్రలో కోవిడ్ -19 యొక్క కొత్త కేసులు నమోదవుతున్నాయని తెలిసి భారతదేశంలో తాజా తరంగం రాబోతోందని తెలిసి ఆమె మనసు కకావికలమైంది.
భారతదేశం తన టీకా రోల్ అవుట్ ను పెంచాలని, పౌరులు డబుల్ మాస్క్ ధరించాలని, సమావేశాలకు దూరంగా ఉండాలని ముఖర్జీ ట్వీట్ చేశారు.
మార్చి చివరి వారంలో భారతదేశాన్ని తాకిన అంటువ్యాధి అలలు స్పష్టంగా కనిపించాయి. రోజూ సుమారు 11,000 కేసుల నుండి, లక్షకు పైగా నమోదవడం ఆందోళన కలిగిస్తున్న అంశం అని అమె పేర్కొన్నారు. ఏప్రిల్ చివరి వారం నుంచి కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది.
వ్యాధి సోకిన వారి సంఖ్య 400,000 దాటింది. ఒకే దేశానికి రోజువారీ కేసులలో ఇది ప్రపంచ రికార్డు.కోవిడ్ -19 వల్ల కలిగే అంటువ్యాధుల విషయంలో అమెరికా తరువాత భారతదేశం రెండవ స్థానంలో ఉంది. మరణాల సంఖ్య మొదటి తరంగంలో ప్రతిరోజూ సగటున 1,000 నుండి రోజుకు 4,000 కు పెరిగింది. ప్రస్తుతం అందరి మనస్సులో మెదులుతున్న పెద్ద ప్రశ్న: ఈ పీడకల ఎప్పుడు ముగుస్తుంది? అని ఆమె తన ట్విట్టర్ అకౌంట్ లో రాసుకొచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com