Chennai: అప్పుడు ప్రియుడి కోసం భర్తని, బిడ్డని వదిలి.. ఇప్పుడు అన్నపూర్ణిగా అవతారం ఎత్తి..

Chennai: గతంలో ఏం చేసినా ఎవరికీ పట్టదు.. ప్రస్తుతం ఆమె భక్తుల మొర ఆలకించే అన్నపూర్ణి. చెంగల్పట్టు జిల్లా తిరప్పోరూర్‌లోని ఓ కళ్యాణ మండపం వేదికగా అన్నపూర్ణి అరసు మాతాజీ దివ్య దర్శనం ఇవ్వనున్నారని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మాతాజీగా అవతారం ఎత్తిన ఆమె చుట్టూ భక్తులు చేరి ఆశీర్వచనాలు తీసుకోవడం, పూనకం వచ్చినట్లు ఊడిపోవడం వంటి వీడియోలన్నీ యూట్యూబ్‌లో ప్రత్యక్షం అవుతున్నాయి. దీంతో ఈ మాతాజీ ఎవరు అని పోలీసులు ఆలోచనలో పడ్డారు.
అన్నపూర్ణి మాతాజీ చుట్టూ అనేక వివాదాలు..
2014లో ఓ టీవీ ఛానల్ వేదికగా జరిగిన చర్యలో తనకు భర్త, 14 ఏళ్ల కుమార్తె కన్నా, ప్రియుడు అరసే ముఖ్యం అని చెప్పి అతడితో వెళ్లిపోయింది. పోలీసుల విచారణలో ప్రియుడు అరసు అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు తేలింది. పోలీసులు రంగంలోకి దిగడంతో అన్నపూర్ణి, ఆమె భక్తులు పత్తా లేకుండా పోయారు. చెంగల్పట్టు పోలీసులు రంగంలోకి దిగడంతో జనవరి 1న పెద్ద ఎత్తున నిర్వహించబోయే కార్యక్రమాన్ని నిర్వాహకులు రద్దు చేసుకున్నారు. తమ సెల్‌ఫోన్లను కూడా స్విచ్ఛాఫ్ చేసుకుని పోలీసుల కంట పడకుండా వెళ్లిపోయారు. దీంతో పోలీసుల దర్యాప్తు వేగవంతం అయింది. మాతాజీని కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com