Himachal Pradesh: సీఎం పదవి.. నేతల మధ్య తీవ్ర పోటీ

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో సీఎం ఎంపిక ప్రతిష్టంభన కొనసాగుతునే ఉంది. ఈ పదవి కోసం నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో కాంగ్రెస్ హైకమాండ్ ఎటూ తేల్చుకోలేకపోతోంది. దీంతో తదుపరి సీఎం ఎవరనేది ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
సీఎం ఎవరనే దానిపై ప్రియాంక ఇవాళ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు చెబుతున్నాయి పార్టీ వర్గాలు. శుక్రవారం రాత్రి కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలు. సీఎం ఎంపిక బాధ్యతను పార్టీ అధిష్ఠానానికి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానాన్ని ఆమోదించింది.
మరోవైపు హిమాచల్ సీఎం ఎంపికకు అధిష్ఠానం తరఫున పరిశీలకులుగా వచ్చిన ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా ఇవాళ మరోసారి పార్టీ నేతలతో సమావేశమయ్యారు.
సీఎం పదవి కోసం పోటీ పడుతున్న పీసీసీ అధ్యక్షురాలు, మాజీ సీఎం వీరభద్రసింగ్ భార్య ప్రతిభా సింగ్, శాసనసభాపక్ష మాజీ నేత ముకేశ్ అగ్నిహోత్రి, వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరభద్రసింగ్ కుటుంబానికే సీఎం పదవిని ఇవ్వాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. అటు ప్రతిభా సింగ్ కూడా సీఎం పదవిని తాను ఆశిస్తున్నట్లు ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com