Gujarat : గుజరాత్ కొత్త సీఎం ఎంపికపై ఇవాళే నిర్ణయం..!

Gujarat : గుజరాత్ కొత్త సీఎం ఎంపికపై ఇవాళే నిర్ణయం..!
గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా ఎవరికి ఛాన్స్ ఇస్తారు.... ఈసారి పటేళ్లకు అవకాశం దక్కుతుందా..? ఇప్పుడిదే ఉత్కంఠ రేపుతోంది.

గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా ఎవరికి ఛాన్స్ ఇస్తారు.... ఈసారి పటేళ్లకు అవకాశం దక్కుతుందా..? ఇప్పుడిదే ఉత్కంఠ రేపుతోంది. కాసేపట్లో BJLP సమావేశంలో కొత్త CM ఎవరనేది ప్రకటిస్తారు. దీనికి పరిశీలకులుగా ఇద్దరు కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్‌, ప్రహ్లాద్ జోషీ ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకున్నారు. డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, వ్యవసాయ మంత్రి ఆర్‌సీ ఫల్దూ, హోంమంత్రి గోర్థన్‌ జడాఫియా మధ్య గట్టి పోటీ ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే కాని వ్యక్తి కూడా CM అయ్యే అవకాశం ఉందని.. పార్టీ ముఖ్యనేతలు వ్యాఖ్యానించడం బట్టి చూస్తే కేంద్రమంత్రులు మన్సుఖ్ మాండవీయ, పురుషోత్తం రూపాలా పేర్లు కూడా ముఖ్యమంత్రి పదవి కోసం పరిశీలిస్తున్నట్టు అర్థమవుతోందంటున్నారు. లక్షద్వీప్‌ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న ప్రఫుల్ ఖోడా పటేల్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఐతే.. హైకమాండ్ మనసులో ఏముంది? నరేంద్రమోదీ, అమిత్‌షా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇవాళే తేలిపోనుంది.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 15 నెలల సమయం ఉంది. వచ్చే ఏడాది డిసెంబర్‌లో అక్కడ ఎలక్షన్ జరగాలి. ఈలోపే సడన్‌గా విజయ్ రూపానీతో రాజీనామా చేయించారు. నిన్న అహ్మదాబాద్‌లో పాటీదార్ల విద్యాసంస్థ 'సర్దార్‌ ధామ్ భవన్'‌ ప్రారంభోత్సవం తర్వాత అనూహ్యంగా రూపాలా తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రధాని మోదీ సహా ముఖ్యులంతా పాల్గొన్న కార్యక్రమం తర్వాత ఆయన రిజైన్‌ చేశారు. స్థానికంగా మారుతున్న రాజకీయ సమీకరణాల ప్రకారం పటేల్‌ సామాజిక వర్గానికి దగ్గరయ్యేందుకు ఇప్పుడు BJP ప్రయత్నం చేస్తోందంటున్నారు. 12 శాతం ఉన్న పాటీదార్ల ఓట్లు కీలకం కావడంతో ఆ సామాజికవర్గానికి చెందిన వారికే ముఖ్యమంత్రిపీఠం దక్కొచ్చంటున్నారు. ఐతే.. కొందరు OBC నేతల పేర్లను కూడా పరిశీలిస్తున్న హైకమాండ్.. చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠ రేపుతోంది.

తాజా పరిణామాలు చూస్తుంటే దేశవ్యాప్తంగా మరింత బలపడేందుకు BJP కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోందా అనే ప్రచారమూ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఏడాది మార్చిలో CM త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేశారు. ఆయన తర్వాత తీరథ్‌ సింగ్‌ రావత్ బాధ్యతలు చేపట్టారు. ఆరు నెలలు తిరక్కముందే ఆయన్నూ పక్కకుపెట్టి పుష్కర్ సింగ్ ధామీ కొత్త CM అయ్యారు. ఇక కర్నాటకలో ఇటీవలే యడియూరప్పను తప్పించారు. ఆయన స్థానంలో బసవరాజ్ బొమ్మైని CM చేశారు. ఇక ఇప్పుడు గుజరాత్ వంతు వచ్చింది. విజయ్ రూపానీ రాజీనామాకు దారి తీసిన పరిస్థితులపై స్పష్టత లేకపోయినా.. ఈ మార్పుల వెనుక BJP పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టే కనిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story