Anand Mahindra: నాకు 'పద్మ' కరెక్ట్ కాదేమో: ఆనంద్ మహీంద్రా

Anand Mahindra: పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర అంటే బహుశా తెలియని వారు ఎవరూ ఉండరేమో. సోషల్ మీడియాతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ ఆయన వెల్ నోటెడ్. స్ఫూర్తి నిచ్చే వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తారు. ఆయన షేర్ చేసే వీడియోల్లో ఏదో ఒక సందేశం మిళితమై ఉంటుంది. తాజాగా పద్మశ్రీ అందుకున్న ఆ అవార్డుకు తాను అర్హుడిని కాదేమో అనే సందేహాన్ని వ్యక్త పరిచారు.
వాణిజ్య, పరిశ్రమల రంగంలో విశేష కృషి చేస్తున్నందుకుగాను మూడవ అత్యున్నత పౌర పురస్కారం అయిన 'పద్మభూషణ్' అవార్డును ప్రదానం చేశారు. అయితే అట్టడుగు స్థాయిలలో విశేష కృషి చేస్తున్న వ్యక్తులతో పాటు సమానమైన గౌరవం పొందడం అదృష్టంగా భావిస్తున్నట్లు మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం పద్మ అవార్డు గ్రహీతల ఆకృతిలో చాలా మార్పులు చేసిందని, "అట్టడుగు స్థాయిలలో సమాజ అభివృద్ధికి కీలకమైన కృషి చేస్తున్న వ్యక్తులపై దృష్టి సారించింది" అని మహీంద్రా ట్వీట్ చేశారు. "
"నేను నిజంగా వారి ర్యాంక్‌లలో ఉండటానికి అనర్హుడనని భావిస్తున్నాను" అని మహీంద్రా గ్రూప్ చైర్మన్ అన్నారు. 30 వేలకు పైగా మొక్కలు నాటిన పద్మశ్రీ విజేత, కర్ణాటక పర్యావరణవేత్త తులసి గౌడపై చేసిన ట్వీట్‌పై ఆనంద్ మహీంద్రా స్పందించారు. 77 ఏళ్ల హలక్కీ తెగకు చెందిన తులసి గౌడ అడవిలోని మొక్కలు, మూలికల గురించి అపారమైన
జ్ఞానం సంపాదించారు. అందుకే అమె "అటవీ ఎన్‌సైక్లోపీడియా"గా పేరుపొందారు. అటువంటి గొప్ప వారికి తగిన గుర్తింపు పొందడం ఎంత అద్భుతమైన దృశ్యం" అని ఆయన పేర్కొన్నారు.
మంగళూరుకు చెందిన పండ్ల వ్యాపారికి కూడా పద్మశ్రీ దక్కడం ముదావహమని మహేంద్ర అభిప్రాయపడ్డారు. అట్టడుగు వర్గాల వారిని గుర్తించి వారు చేస్తున్న కృషికి గాను పద్మశ్రీ వంటి అరుదైన సత్కారాలతో గుర్తించడం ప్రశంసనీయం..
నిజమైన అర్హులు అంటే వాళ్లు.. నాలాంటి వారు కాదు అని ఆనంద్ మహీంద్రా తెలిపారు. ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్‌పై పలువురు నెటిజన్లు స్పందించారు. కొందరు ఆయన కామెంట్‌ను స్వాగతించారు. మరికొందరు ఆయన హూందాతనాన్ని గౌరవించారు. ఈ కామెంట్‌తో నెటిజన్స్ మనసుని మరోసారి దోచుకున్నారు మహీంద్రా.
This Govt has made a long-overdue, transformational shift in the texture of the Padma Awards recipients. Now, the focus is largely on individuals making seminal contributions to the improvement of society at grassroots levels. I truly felt undeserving to be amongst their ranks. https://t.co/jor34tqx1w
— anand mahindra (@anandmahindra) November 9, 2021
This Govt has made a long-overdue, transformational shift in the texture of the Padma Awards recipients. Now, the focus is largely on individuals making seminal contributions to the improvement of society at grassroots levels. I truly felt undeserving to be amongst their ranks. https://t.co/jor34tqx1w
— anand mahindra (@anandmahindra) November 9, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com