Madhya Pradesh Tikamgarh: భర్త బలవంతం చేశాడు.. భార్య అంత పని చేసింది..

Madhya Pradesh Tikamgarh: ఒక భర్త, భార్య మధ్య ఎంత ఎక్కువ అర్థం చేసుకునే గుణం ఉంటే.. వారి జీవితం కూడా అంత సాఫీగా సాగిపోతుంది. కానీ ఒకవేళ కొంచెం అటు ఇటు అయినా వారి మధ్య కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చెప్పడం కష్టంగా మారిపోయింది. చిన్న చిన్న కారణాలకే ఈమధ్య హత్యలు, ఆత్మహత్యలు కామన్‌గా మారాయి. కానీ మధ్యప్రదేశ్‌లోని ఓ మహిళ తన భర్తకు బుద్ధి చెప్పడానికి వేరే ఉపయాన్నే ఆలోచించింది.
మధ్యప్రదేశ్‌లోని టికామ్‌ఘడ్ పట్టణానికి చెందిన ఓ మహిళ 2019లో వివాహం చేసుకుంది. అయితే పెళ్లయిన దగ్గర నుండి వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. అయితే ఆ గొడవలకు తట్టుకోలేని వీరిద్దరు కొన్నాళ్లు వేర్వేరుగా కూడా ఉన్నారు. అయినా కొంతకాలం తర్వాత వారి కలిసిపోయి ఒకే ఇంట్లో ఉండడం మొదలుపెట్టారు.
అదే సమయంలో తనకు ఇష్టం లేకుండా బలవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని భార్య.. తన భర్త జననాంగాన్ని కోసేసింది. ఈ ఘటన జరిగి చాలారోజులే అయినా.. భర్త ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు భార్యపై ఐపీసీ సెక్షన్ 324 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వంటగదిలో కత్తితో భార్య తన భర్త జననాంగాన్ని కోసిందని పోలీసులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com