నాలుగు రోజులు... 12గంటలు న్యూ లేబర్ రూల్స్

నాలుగు రోజులు... 12గంటలు న్యూ లేబర్ రూల్స్
సదుపాయాల కల్పన కూడా ఇబ్బందిగా మారుతుందన్నారు.

44 లేబర్ చట్టాలను 4 చట్టాలకు కుదిస్తోంది కేంద్రం. ఇందులో భాగంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. చేస్తోంది. పారిశ్రామిక వర్గాల నుంచి వచ్చిన వినతులు, కమిటీ నివేదికల నేపథ్యంలో ఇక నుంచి రోజుకు 12గంటలు డ్యూటీ.. వారానికి 4 రోజుల పనిదినాలు రానున్నాయి. అయితే ఇది తప్పనిసరి నిబంధన కాదు. వారానికి 48గంటలు పని చేయాల్సి ఉంటుంది. అవసరాలకు అనుగుణంగా వారి సేవలు వినియోగించుకోవచ్చు. అయితే దీనిపై కార్మిక యూనియన్లు అభ్యంతరం చెబుతున్నాయి. ఉద్యోగుల హక్కులను కాలరాస్తారని.. వారానికి 6 రోజులు 12గంటలుచేయించుకుంటారని అంటున్నారు. వారి ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు.

వైట్ కాలర్ ఉద్యోగులకు ఇది ఏమాత్రం పనిచేయదని.. పైగా కంపెనీలకు అదనపు భారం పడుతుందని అంటున్నారు. సదుపాయాల కల్పన కూడా ఇబ్బందిగా మారుతుందన్నారు. అయితే రియల్ ఎస్టేట్, భారీ ఉత్పత్తి సంస్థలకు అనుకూలంగా మారుతుందని అంటున్నారు.

మహిళా ఉద్యోగులపై ఎఫెక్ట్...

12 గంటల డ్యూటీ ఎఫెక్ట్ మహిళా ఉద్యోగులపై ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో వారి వర్క్ ఫోర్స్ 20.33శాతం మాత్రమే ఉంది. 12గంటల డ్యూటీ విధానం వల్ల మూడూ రోజుల లీవ్ వచ్చినా.. మిగిలిన నాలుగు రోజుల్లో వారిపై స్ట్రెస్ అదనంగా ఉంటుంది.. అంతేకాదు కుటుంబభారం అదనంగా ఉంటుంది కాబట్టి తగ్గే అవకాశం ఉంది. ఈకారణంగా కంపెనీలు కూడా మహిళలను కూడా తీసేసే అవకాశాలుంటాయి.

Tags

Next Story