Winter Session: రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..

Winter Session: రేపటి నుంచి ఈనెల 29 వరకూ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనుండగా.. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేసింది. దీనికోసం అన్ని పార్టీలను కేంద్రం ఈ మేరకు ఆహ్వానించింది. ఈ దఫా పార్లమెంటు సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు సమావేశంలో ప్రస్తావనకు రానున్నాయి. కొత్త బిల్లులు, చర్చకు తీసుకురానున్న అంశాలను కేంద్రం వివరించనుంది. ఈసారి శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం ఉభయ సభల ముందుకు 16 బిల్లులను తీసుకు రానున్నట్లు తెలుస్తోంది.
ఇక సాయంత్రం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సారి సమావేశానికి ముందు సంప్రదాయంగా నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి బదులు బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశాన్ని పిలవాలని నిర్ణయించారు. మరోవైపు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహించింది. సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ భేటీ అయ్యింది. సరిహద్దు ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం సహా ప్రజల భద్రతకు సంబంధించిన అన్ని అంశాలను పార్లమెంట్‌లో లేవనెత్తాలని పార్టీ నిర్ణయించుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com