WIPRO: ఫ్రెషర్స్‌పై విప్రో వేటు.. 452 మంది ఉద్యోగులను..

WIPRO: ఫ్రెషర్స్‌పై విప్రో వేటు.. 452 మంది ఉద్యోగులను..
WIPRO: పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చిందని ఎగిరి గంతేసేలోపు అది కాస్తా ఊష్టింగ్ అయింది. ఐటి దిగ్గజం విప్రోలో రిక్రూట్ చేసుకున్న ఫ్రెషర్స్ పనితీరు ఆశాజనకంగా లేదని భావించిన సంస్థ 452 మంది ఉద్యోగులను తొలగించింది.

ఇంటర్నల్ అసెస్‌మెంట్ పరీక్షల్లో పేలవమైన పనితీరు కారణంగా 452 మంది ఉద్యోగులను ఐటీ దిగ్గజం విప్రో తొలగించింది. బాధిత ఉద్యోగులందరికీ కంపెనీ తొలగింపు లేఖలు జారీ చేసింది. తగిన శిక్షణ ఉన్నప్పటికీ, వారు పనితీరులో విఫలమయ్యారని పేర్కొంది.

ఉద్యోగులు తమ కోసం ఖర్చు చేసిన శిక్షణ ఖర్చులో రూ.75,000 చెల్లించాల్సి ఉంటుందని టెర్మినేషన్ లెటర్‌లో పేర్కొన్నట్లు వర్గాలు వివరించాయి. కానీ, ఆ మొత్తాన్ని మాఫీ చేస్తున్నారు. "మీరు చెల్లించాల్సిన శిక్షణ ఖర్చు రూ. 75,000 మాఫీ చేయబడుతుందని మేము మీకు తెలియజేయాలనుకుంటున్నాము" అని లేఖలో ఉంది.

అత్యున్నత ప్రమాణాలు ఉన్న అభ్యర్ధులకు మాత్రమే విప్రో సంస్థలో పని చేసే అవకాశం లభిస్తుందని తెలియజేయడానికి గర్విస్తున్నట్లు స్పష్టం చేసింది. "ప్రతి ఉద్యోగి నుండి వారు నియమించబడిన పని ప్రాంతంలో ఒక నిర్దిష్ట స్థాయి నైపుణ్యం కలిగి ఉండాలని సంస్ధ భావిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story