హైదరాబాద్‌లో కారు బీభత్సం.. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారులపైకి..

హైదరాబాద్‌లో కారు బీభత్సం.. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారులపైకి..
X
కాగా కారును మహిళ డ్రైవ్ చేసినట్లు అనుమానిస్తున్నారు.

హైదరాబాద్ పాత బస్తీలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మిశ్రీగంజ్‌లో ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారుల పైకి కారు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారికి రెండు కాళ్లు విరిగిపోయాయి. మరో బాలుడు తృటిలో తప్పించుకున్నాడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. కాగా కారును మహిళ డ్రైవ్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె ఇటీవలే యూఏఈ నుంచి వచ్చిందని స్థానికులు వెల్లడించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags

Next Story