Madhya Pradesh: అమ్మ ప్రేమ.. పులితో పోరాడి బిడ్డను కాపాడుకుంది..

Madhya Pradesh: అతి అత్యంత క్రూర జంతువు. దాని నోటికి చిక్కితే ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సింది. అయినా అవేమీ గుర్తుకు రాలేదు. ఆ తల్లికి. తన బిడ్డను కాపాడుకోవడమే తక్షణ కర్తవ్యంగా భావించింది. అపర కాళి అవతారమెత్తింది. శక్తినంతా కూడదీసుకుంది. అది ఓ క్రూర జంతువు అన్న విషయాన్నే మర్చిపోయింది. శక్తి కొలది పోరాడి తన బిడ్డను కాపాడుకుంది.
జబల్‌పూర్‌లో పులి దాడిలో మహిళ, ఆమె కొడుకు ఇద్దరూ గాయపడ్డారు. తీవ్రగాయాలతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్ సమీపంలోని జబల్‌పూర్‌లో ఒక మహిళ తన కుమారుడిని పులి బారి నుండి రక్షించడానికి అమితమైన ధైర్యాన్ని ప్రదర్శించింది.
"పులి బయట తిరుగుతోందని ప్రజలు భయపడుతున్నారని ఫారెస్ట్ రిజర్వ్ పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో తల్లి పొలం పనులు చేస్తుండగా ఏడాదిన్నర బాలుడిపై పులి దాడి చేసింది. ఆ స్త్రీ తన బిడ్డకు రక్షణగా ఉండి, పులి చేసే ప్రతి దాడిని ఎదుర్కొంటూనే ఉంది. పులి నుంచి రక్షించుకోవడానికి ఆ మహిళ వద్ద ఎలాంటి ఆయుధం లేదు. అయినా ధైర్యంతో పులిని ఎదిరించింది బిడ్డను కాపాడుకుంది. తల్లి ప్రేమ ముందు పులి తల వంచింది.
ఆమె సహాయం కోసం అరుస్తూ గ్రామస్థులను అప్రమత్తం చేసింది. వారు జంతువును తరిమికొట్టారు. చిన్నారి తలకు గాయాలు కాగా, తల్లి శరీరమంతా గాయాలయ్యాయి. గాయపడిన మహిళ భర్త భోలా చౌదరి మాట్లాడుతూ, తమ ఏడాది కొడుకుని తీసుకుని భార్య పొలం పనులకు వెళ్లింది. పులి తరుగుతుందన్న విషయం ఆమెకు తెలియదు. దాడిలో భార్య, బిడ్డ ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారని భోలా తెలిపాడు. అదృష్టవశాత్తు ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారని అన్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com