Attack On Dogs: పెంపుడు శునకాలపై దాష్టీకం....

X
By - Chitralekha |14 April 2023 12:46 PM IST
పెంపుడు శునకాన్ని గోడకేసి బాదిన పనిమనిషి; ఎన్జీఓ పుణ్యమాని ముగ జీవాలకు విముక్తి
పెంపుడు శునకాలపై పనిమనిషి విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన ఢిల్లీలోని గుర్గాంవ్ లో చోటుచేసుకుంది. సెక్టార్ 109లో నివాసముంటోన్న తండ్రీ కొడుకులు రెండు విదేశీ జాతి కుక్కలను పెంచుకుంటున్నారు. ఆ ఇంట్లో పనిచేసే మహిళే వాటి బాగోగులు చూసుకుంటోంది. ఈ క్రమంలో బుధవారం శునకాలను పక్కనే ఉన్న సొసైటీ పార్క్ కు తీసుకువెళ్లి తీసుకువచ్చిన మహిళ వాటితో పాటూ లిఫ్ట్ ఎక్కింది. అక్కడ ఓ శునకాన్ని మెడకు కట్టిన తాడుతో ముడుసార్లు లిఫ్ట్ లోనే నేలకేసి బాదింది. ఈ తతంగమంతా సీసీటీవీలో రికార్డు అవ్వడంతో ఈ ఘోరం బయటపడింది. సదురు శునకానికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే కుక్క కరిచేందుకు ప్రయత్నించడం వల్లే తాను కొట్టానని సదరు మహిళ చెప్పగం గమనార్హం. ఈ వీడియో బయటకు రావడంతో జంతు సంరక్షణా సంస్థ రంగంలోకి దిగి శునకాలను యజమానుల చెర నుంచి విడిపించారు. ప్రస్తుతం రెండు శునకాలు కోలుకుంటున్నట్లు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com