పండక్కి ఇల్లు క్లీన్ చేస్తూ 3 లక్షలు విలువ చేసే బంగారాన్ని చెత్తలో..

పండక్కి ఇల్లు క్లీన్ చేయడమంటే.. పనికిరానివన్నీ చెత్తలో పడేయడం కానీ పసిడిని చెత్తలో పడేస్తారా ఎవరైనా.. పుణెలోని పింప్లే-సౌదాగర్ ప్రాంతానికి చెందిన రేఖ సులేఖ.. పనికిరాని చెత్తనంతా తీసుకెళ్లి మునిసిపాలిటీ బండిలో పడేసింది. ఏ ధ్యాసలో ఉందో ఏమో ఇల్లు సర్ధుతుంటే ఓ చిన్న చేతి సంచి కనిపించింది.. అందులో ఏం పెట్టిందీ గుర్తు లేదు.. ఒకసారి విప్పైనా చూడలేదు. చెత్తతో పాటు దాన్ని పడేసింది.. ఆ తరువాత ఎప్పటికో లైట్ వెలిగింది.. అందులో గోల్డ్ పెట్టిన విషయం గుర్తొచ్చింది.
ఆ సంచిలో మంగళసూత్రం, కాలి గజ్జెలు, మరి కొన్న పసిడి ఆభరణాలు ఉన్నాయి. చేసిన తప్పు తెలుసుకుని ఓ క్షణం ఎవర్ని పట్టుకుంటే తన వస్తువులు తనకి తిరిగి వస్తాయని ఆలోచించింది. సంజయ్ కుటే అనే స్థానిక సామాజిక కార్యకర్తను సంప్రదించింది. సామాజిక కార్యకర్త మునిసిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల బృందాన్ని సంప్రదించారు. వారు దాదాపు గంటసేపు వెతికి చెత్తలో ఉన్న సంచిని పట్టుకోగలిగారు. దాదాపు 18 టన్నుల చెత్తను జల్లెడ పట్టారు. ఇంకొంచెం ఆలస్యం జరిగి ఉంటే సంచిని గుర్తించడం అసాధ్యమయ్యేదని మునిసిపల్ సిబ్బంది అన్నారు. కార్పొరేషన్ ఉద్యోగి బ్యాగ్‌ను యజమానికి సురక్షితంగా అందించారు. తన బ్యాగును తిరిగి తెచ్చి ఇవ్వడంలో సహాయం చేసిన వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com