వైసీపీ నేతలు తాలిబన్లను మించిపోయారు: అచ్చెన్నాయుడు

సీఎం జగన్ ఏపీని అఫ్గనిస్తాన్‌గా మార్చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. వైసీపీ నేతలు తాలిబన్లను మించిపోయారని ధ్వజమెత్తారు. చంద్రబాబు నివాసం వద్ద వైసీపీ గూండాల దాడిని ఖండిస్తున్నామని అన్నారు. ఇంతకింతా బదులు తీర్చుకుంటామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. జగన్ ఫ్యాక్షన్ రాజకీయాలకు అలవాటు పడ్డారని విమర్శించారు. అరాచక పాలనపై మాట్లాడితే తప్పా? అని ప్రశ్నించారు.
రెండున్నరేళ్ల జగన్ పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. పోలీసుల్ని జగన్ గుప్పిట్లో పెట్టుకుని.. దాడుల్ని ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ను అరెస్ట్ చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. జోగి రమేష్‌ను అరెస్ట్ చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తాం అని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com